ప్రవాళద్వీపము
ఆగష్టు 10, 2022
ప్రవాళద్వీపము (pravala-dvīpamu)
అర్థము
(విశేష్యము): ప్రవాళము=పగడము; ద్వీపం=నీటితో చుట్టబడిన ప్రదేశం; పగడాల దిబ్బ; ఉప్పునీటి పాయ (lagoon) చుట్టూ ఉన్న వలయాకార ప్రదేశము
Meaning
(noun) : atoll
వాడుక / Usage
సాధారణంగా ప్రవాళద్వీపాలు అయన రేఖా ప్రాంతంలో ఖండాలకు తూర్పు దిక్కుగా ఎక్కువ ఉంటాయి.
Atolls are generally found in the tropics to the east of continents.
మెదడుకు మేత / Food for thought
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
ఓ..అసలే విరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు
హా..చారెడు పిడికెడు బారెడు పిల్లా ఎల్లాగున్నావు-ఎందా
చెంపకు కన్నులు చారెడు
సన్నని నడుము పిడికెడు
దువ్వి దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు
మనసిలాయో..ఓ..ఓ
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
హా..అయ్యో పావం ఆషాంద్ర కార్యం ఎందాయి -అదేమిటి
ఓ..గుటకల చిటికెలు కిటుకులు అబ్బో చాలా గడుసు
మ్మ్..గుట్కలు చిటికెలు కిటుకులు ఏమిటి సంగతి
ఆ..కులుకు చూస్తే గుటకలు
సరసకు రమ్మని చిటికెలు
చక్కని చిన్నది అందం చందం చేజెక్కాలని కిటుకులు
మనసిలాయో..ఓ..ఓ
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
మనసిలాయో..మనసిలాయో అమ్ము కుట్టి
గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను గువ్విళ్ళు
పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు
చుట్టూ చూస్తే అందాలు లొట్టలు వేస్తూ మా వారు
చుట్టూ చూస్తే అందాలు లొట్టలు వేస్తూ మా వారు
అక్కడ తమకు ఇక్కడ మనకు విరహంలోన వెక్కిళ్ళు
మనసిలాయో..హో..హో
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
అమ్ము కుట్టి అమ్ము కుట్టి మనసిలాయో
కిట్ట మూర్తి కిట్ట మూర్తి తెలుసులేవోయ్
-- పెళ్లి పుస్తకం, ఆరుద్ర (ఆగష్టు 31, 1925 - 1998)
Comments
Post a Comment