Posts

Showing posts from May, 2026

పాద్యము

  మే 15, 2025 పాద్యము   ( pādyamu )     అర్థము      (విశేషణము)  : పాదములు కడుగుకొనుటకు నీరు     Meaning     (adj )  : water for washing the feet      వాడుక / Usage      పాద్యమ్ము నిడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్ళతో కాళ్ళు కడుగనుంటి .     To clean your feet I have no scented water; but I will wash them with my tears (of joy).    మెదడుకు మేత / Food for thought      ఆడుకున్నారిచట ఆమ్నాయ బాలికలు      యుగవీధులందు నాలుగు స్తంభములయాట      పాడుకున్నారిచట బ్రహ్మర్షి సత్తములు      గంగాతరంగిణీ గతులలో శృతి గలిపి .      కాళిదాస కవీంద్రు కవితాకుమారి నా      శిఖరామ్చాలములందు స్వేచ్చగా తిరిగినది      కంది కుందెడి యక్షసుమ్దరికి చల్లగా      అందించినది "మేఘసందేశ "మిచ్చోట .      ఇది నా తపోభూమి ఇది నా మహాభూమి      బదరీ మహాక్షేత్ర పరమపావ...

కుదిలించు

  మే 14, 2025 కుదిలించు   ( kudilinchu )     అర్థము      (క్రియ)  : బాగా కదిలించు; విదిలించు    Meaning     (verb )  :  to shake violently; jolt      వాడుక / Usage      గుండె కుదిలించి నీ ముందు కుప్పవోతు అందుకోవయ్య హృదయ పుష్పాంజలులను .     I will stir my heart and empty at your feet; accept flower bedecked salutations from the depths of my heart.    మెదడుకు మేత / Food for thought      బృందారకానంద మందార మకరంద      బిందునిష్యందాల విందు పెండ్లి :      రంగారు ముంగారు సరసాంత      రంగాల సత్యనర్తనము పెండ్లి :      సోగాకన్నులరాణి రాగరంజితపాణి      రాణించు మాణిక్యవీణ పెండ్లి :      చిన్నారి పొన్నారి చిగురు చెక్కిళ్ళలో      నవ్వులొల్కు గులాబిపువ్వు పెండ్లి:      ప్రేమతో దేవతలు పెట్టు బిక్ష పెండ్లి : ...

పోకారు

  మే 13, 2025 పోకారు   ( pokāru )     అర్థము      (క్రియ)  : నాశనమవ్వు    Meaning     (verb )  : to be destroyed      వాడుక / Usage      లోకాల చీకట్లు పోకార్ప రవిచంద్ర దీపాలు గగనాన త్రిప్పలేక .     To destroy the darkness of the world; perpetually you hurtle Sun and Moon in the heavens.    మెదడుకు మేత / Food for thought     వోయీ మానవుడా..!!    బుద్ధదేవుని భూమిలో పుట్టినావు   సహజమంగు ప్రేమ నీలోన చచ్చ్చేనేమి   అందమును హత్య చేసి హంతకుండా   మైలపడిపోయెనో నీ మనుజ జన్మ..!!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

రోలంబము

  మే 12, 2025 రోలంబము   ( rolambamu )     అర్థము      (విశేష్యము)  : తుమ్మెద    Meaning     (noun )  : black bee      వాడుక / Usage      పూల కంచాలలో రోలంబము లకు రేపటి భోజనము సిద్ధ పరచి పరచి .     Flowers as dining plates, sumptuous feast for the morrow, to bees, you prepare.    మెదడుకు మేత / Food for thought     మన దాంపత్యము సత్యమౌ ప్రణయ సామ్రాజ్యమ్ములో లోతులన్    గనియెన్; సాగెను భాగ్యనౌక కవితాకాళిందిలో; నవ్య జీ    వన బృందావన దివ్యసీమ విహరింపన్ రమ్ము; నే కొల్లగొం   దును నీ కోమల బాహుబంధనములందున్ కోటిస్వర్గమ్ములన్     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

చలువ

  మే 11, 2025 చలువ   ( chaluva )     అర్థము      (విశేష్యము)  : దయ; అభిమానం; చల్లదనం; జలుబు    Meaning     (noun )  : cold; cooling nature; affection; benign      వాడుక / Usage      కలికి వెన్నెలలూరు చలువ దోసిళ్ళతో లతలకు మారాకు లతికి యతికి .     Affectionately with own hands - beautiful as moonlight - having stitched tender leaves to the creepers.    మెదడుకు మేత / Food for thought     చూచెదవేల నో ప్రణయసుందరి! కాటుక కళ్లలోని ఆ    లోచన లేమిటో హరిణలోచనీ! నీ చిరునవ్వులోని సం    కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో    దాచుకొనంగనేటికి సుధామయసూక్తి కళావిలాసినీ!     -- కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి

భ్రాంతి

  మే 08, 2025 భ్రాంతి   ( bhrānṭi )     అర్థము      (విశేష్యము)  : ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టును తలచుట; గిరగిరా తిరగడం; నివ్వెరపోడం    Meaning     (noun )  : delusion; whirling      వాడుక / Usage      మనస్సు ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా ఉండి భ్రాంతి లేక వాంఛా రహితమైనపుడు దేనినీ కోరదు దేనినీ తిరస్కరించదు .     When the mind is peaceful, pure and steady, has no delusions or desires, then it will neither covet nor reject.    మెదడుకు మేత / Food for thought     నీ మౌనం కన్నా నీ మాటలు మేలు అనిపిచ్చినప్పుడు మాత్రమే నోరు తెరిచి మాట్లాడు.     - - అరేబియన్ సామెత

పక్వము

  మే 07, 2025 పక్వము   ( pakvamu )     అర్థము      (విశేషణము)  : వండినది; పండినది; పరువము    Meaning     (adj )  : cooked; ripe; fit for use; nubile      వాడుక / Usage     మనస్సులో వైరాగ్యము కలిగినపుడు సరి అయిన క్షణమున ఈ అనుగ్రహము వివేకముగా పక్వమగును .     At the opportune moment when the mind is non-attached, that grace will ripen into enlightenment. .    మెదడుకు మేత / Food for thought      నీరు ద్రవరూపంలో ఉండి, మెత్తగా, దేనికైనా లొంగిపోయేలా కనిపిస్తుంది. కానీ, అత్యంత కఠినమైన రాయిని కూడా నీరు కాలక్రమేణా అరగదీస్తుంది. ఇది ఒక విచిత్రమైన సత్యం: "మెత్తదనమే అసలైన శక్తి."     - -  లావు జు (Lao Tzu)

పరిత్యజించు

  మే 06, 2025 పరిత్యజించు   ( pari-tyajinchu )     అర్థము      (క్రియ)  : వదిలి పెట్టు; విడువు    Meaning     (verb )  : renounce; abandon; give up      వాడుక / Usage     ఆ విధముగా నీవు దుష్టవాసనాబలమును అతిక్రమించినపుడు, నిర్మలవాసనలను సైతము పరిత్యజింప వలసి యుండును .     Once you overcome the unconscious impressions of bad activities, you should also shed the past impressions of good activities.    మెదడుకు మేత / Food for thought      ఒక వ్యక్తి జ్ఞానం కోసం అన్వేషిస్తున్నట్లయితే, అతను తెలివైనవాడు; కానీ తనకు జ్ఞానం లభించిందని అతను అనుకుంటే, అతనికి పిచ్చి పట్టినట్లే.     -- పెర్షియన్ సామెత

అవలంబనము

  మే 05, 2025 అవలంబనము   ( avalambanamu )     అర్థము      (విశేష్యము)  : చేపట్టుట; ఊత; ఆశ్రయము; శరణు; ఆధారము    Meaning     (noun )  :  taking hold off; support; prop; protection      వాడుక / Usage     కావున దైవాపరాయణత్వమును పరిత్యజించి స్వప్రయత్నమును అవలంబింపుము .     Hence stop putting the onus on God and rely on your own effort.    మెదడుకు మేత / Food for thought      నీ శత్రువు నీపై పగ తీర్చుకోవచ్చు, నిన్ను పీడించవచ్చు. కానీ, నీ హృదయంలో పేరుకుపోయిన కోపం మరియు ద్వేషం నీకు కలిగించే నష్టం అంతకంటే చాలా పెద్దది. నీ హృదయం  అవమానాలను క్షమించి, మరిచిపోగలిగితే వచ్చే  మేలు -  నీ తండ్రి గానీ, నీ తల్లి గానీ, లేదా నీ కుటుంబం మొత్తం కలిసినా సరే  చేయలేరు.     -- ధమ్మపదం ,  గౌతమ బుద్ధుడు బోధించిన సూక్తుల సమాహారం

వక్కాణించు

  మే 04, 2025 వక్కాణించు   ( vakkāṇinchu )     అర్థము      (క్రియ)  : వ్యాఖ్యానించు; నొక్కి చెప్పు    Meaning     (verb )  :  to stress/tell/narrate; comment upon      వాడుక / Usage     శాశ్వత శ్రేయమును చేకూర్చు మార్గమునందే నడువవలెనని మహాత్ములు నొక్కి వక్కాణించు తున్నారు .     The Enlightened stress that one should only tread the path of eternal beatitude.    మెదడుకు మేత / Food for thought      మీ స్నేహితులలో కొందరు మిమ్మల్ని పొగుడుతారు, మరికొందరు మిమ్మల్ని నిందిస్తారు మరియు విమర్శిస్తారు; మిమ్మల్ని నిందించేవారికి దగ్గరగా ఉండండి మరియు మిమ్మల్ని పొగిడేవారికి దూరంగా ఉండండి.     -- ది తాల్ముద్,  జుడాయిజం యొక్క కేంద్ర గ్రంథం