Posts

Showing posts from September, 2021

ప్రతీతి

  సెప్టెంబర్ 30, 2021 ప్రతీతి  ( pratīti )       అర్థము      (విశేష్యము ):  ప్రసిద్ధి; కీర్తి; ఖ్యాతి; సంతోషము     Meaning     (noun) : fame; well known; general belief; reputation; delight           వాడుక / Usage కృష్ణదేవరాయలు శ్రీకాకుళేశ్వర ఆలయంలో ఆముక్తమాల్యద రచించినట్లు ప్రతీతి . It is believed that Krishna Deva Raya authored Amuktamalyada in SriKakuleshwara temple.     మెదడుకు మేత / Food for thought ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం న జానన్తి కధం మోక్షః శృణు ప్రియే ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగునని తీర్ధ స్నానమునకై పరుగులెత్తెడు మానవులు భ్రమకు లోబడినవారు. ఆత్మజ్ఞాన తీర్ధంలో స్నానమాచరించని వారికి మోక్షమెటుల కలుగును?

ప్రామాణ్యము

  సెప్టెంబర్ 29, 2021 ప్రామాణ్యము  ( prāmāṇyamu )       అర్థము      (విశేష్యము ): సాక్ష్యము; నిదర్శనము; ఉదాహరణము;  దృష్టాంతము     Meaning     (noun) : proof; evidence; authority; example           వాడుక / Usage మన దేశంలో ఆంగ్ల వ్యాకరణమునకు ప్రామాణ్యము రెన్ అండ్ మార్టిన్ పుస్తకము. Wren & Martin is considered the authority on grammar in India.     మెదడుకు మేత / Food for thought చితా చింతా ద్వయోర్మధ్యే చింతా నామ గరీయసీ చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుః చితి మరియు చింతల్లో, చింత గొప్పది! చితి ప్రాణం లేని శరీరాన్ని దహిస్తుంది, చింత ప్రాణం గల శరీరాన్నే దహిస్తుంది. -- సుభాషితం

ప్రగల్భము

  సెప్టెంబర్ 28, 2021 ప్రగల్భము  ( pra-galbhamu )       అర్థము      (విశేషణము ): బడాయి; డాంబికం; గర్వపు మాటలు; ప్రౌఢమైన     Meaning     (adj) : boast; bold; spirited           వాడుక / Usage రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. The government boasted about doubling farmers income.     మెదడుకు మేత / Food for thought యుధిష్ఠిర! మృత్యువు ప్రసన్నమైనప్పుడు మనిషి యొక్క ఆప్తమిత్రుడు ఎవరు? క్షణాలను కాలసర్పం కబళించే ఘడియల్లో మృత్యుదేవత చల్లని వడిలో వాలే వేకువలో అహోరాత్రులూ పోగేసిన ధనరాశి, అహర్నిశం తోడున్న జీవిత భాగస్వామి కానేరవు మహాత్మా , మనిషికి స్నేహితులు ఒంటరై, మనుజుడొక్కడే, మునుపెరుగని మనుగడదెలియని మరుభూమిలో చిరుగాలిలో రెపరెపలాడే ఆకు నేలవ్రాలినట్లు చేరడా మహాప్రస్థానంలో సమసిపోయే ప్రమిధ మహోజ్వలంగా వెలిగిపోయినట్లుగా కుంగి పోయే కుసుమం జిలుగు రంగుల గుబాళింపు పరిమళించినట్లుగా జగన్నాథా! చితిమంటల ఆధారమే ఈ కాషాయంలో కట్టెలవలే తేలెనే బ్రతుకు కోరికల స...

ప్రకరణము

  సెప్టెంబర్ 27, 2021 ప్రకరణము  ( prakaranamu )       అర్థము      ( విశేష్యము ): ప్రస్తావము; గ్రంథములో ఒక భాగము; నాటకాలలో ఒక పద్ధతి; రాజ్యాంగ నిబద్ధన     Meaning     (noun) : topic; subject; chapter of a book; type of drama; article in constitution           వాడుక / Usage రాజ్యాంగంలోని 14,15,16,17 ప్రకరణలు సమానత్వపు హక్కును విశదీకరిస్తున్నాయి. Articles 14,15,16,17 in the Constitution proclaim the Right to Equality.     మెదడుకు మేత / Food for thought ఏడ భేఫికర్ గుండె ఖుల్లం ఖుల్లా గుంటదో. ఏడ మోరెత్తుకుని బెదుర్లేక బతక లేస్తమో. ఏడ తెల్వి ఏ ఒక్కని సోత్తయి పొదో. ఏడనయితే జమానా జిందగీ మొత్తం బరాబర్ ఇరుకు గదుల్లెక్క ఇడగొట్టుకు పొదో. యాడ్నతే గొంతునొచ్చే ప్రతిమాటా సచ్చం గుంటదో. గలేమిల్నకి పుర్శత్ చేతులు పూరా సాపుకుని అలాయ్ బలయ్ అంటయో. సచ్చమైన పంటకాల్వలెక్క కొట్టే  అలగ్  సొంచాయిన్చుడు బుద్ధి, పాసిపోయిన పాతలవాట్ల ఇసుకపర్ర లోంకి ఇంకిపోకండుంటదో. యాడైతే నా బుర్రా బుద్ధిని సచ్ సొంచాయిన్చ...

నిర్మలము

  సెప్టెంబర్ 24, 2021 నిర్మలము  ( nir-malamu )       అర్థము      (విశేషణము): మలినము లేకపోవడం; శుద్ధము; శుభ్రము; (విశేష్యము): ధరించి తీసివేసిన పూలదండ; అభ్రకము     Meaning     (adj) : dirt free; pure; transparent; (noun): used garland; Mica           వాడుక / Usage నిర్మలమైన నిశ్చలమైన  నీటిలోనే నీడ కనపడినట్లు ఆత్మ జ్ఞానానికి అదే విధమైన మనసు కావాలి. Just as a reflection is only seen in unclouded and still water, a similar mind is needed for understanding the Self.     మెదడుకు మేత / Food for thought     అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము ....     సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము     త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై     ముక్తి నొసగు భక్తి యోగ మార్గము     మృతియె లేని సుధాలాప స్వర్గము  శంకరాభరణము      ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము     పాదాని  శంకరాభరణము      శంకర ...

నిశ్చలము

  సెప్టెంబర్ 23, 2021 నిశ్చలము  ( niṣ-chalamu )       అర్థము      (విశేషణము): చలించనిది; స్థిరము; స్థిమితము; కదలక పోవడం     Meaning     (adj) : motionless; firm; resolute           వాడుక / Usage నిశ్చలమైన పట్టుదలతో ఆమె సమస్యలన్నీ ఎదురుకుంది. She faced all the obstacles with resolute firmness.     మెదడుకు మేత / Food for thought వస్తా వట్టిదే   పోతా వట్టిదే   ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట చేతిలో అమృతము ఉన్నంత సేపే అన్నదమ్ములంట ఆగాధంబై   పోయేనాడు   ఎవరు రారు   వెంట వస్తా వట్టిదే   పోతా వట్టిదే   ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట పంచ భూతముల   తోలు బొమ్మతో ప్రపంచమా యె నట అంతము వరకు కించిత్ ఆశతో పెంచెను జగమంతా వస్తా వట్టిదే   పోతా వట్టిదే   ఆశ ఎందుకంట చేసిన ధర్మము చెడని పదార్ధము చేరును మీ వెంట -- తత్వాలు (రచయిత తెలియదు), అమరగాయకులు బాలమురళీకృష్ణ (జులై 6, 1930 - 2016)

నివృత్తి

  సెప్టెంబర్ 22, 2021 నివృత్తి  ( nivṛitti )       అర్థము      (విశేష్యము): ప్రవృత్తి (క్రియ) లేనిది; మోక్షము; సంతోషము; నివారణము;      Meaning     (noun) : renunciation; removal; abolition           వాడుక / Usage మనిషి ఉన్నంతవరకు యుద్ధాల నివృత్తి సాధ్యమేనా? As long as man exists is the abolition of war possible?     మెదడుకు మేత / Food for thought తెలుగుదనమువంటి తీయందనము లేదు తెనుగు కవులవంటి ఘనులు లేరు తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలితసుగుణజాల! తెలుగుబాల!! కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు నష్టపెట్టబోకు నాన్నపనులు తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా లలితసుగుణజాల! తెలుగుబాల!! -- తెలుగుబాల శతకం (1961), జంధ్యాల పాపయ్య శాస్త్రి  (ఆగష్టు 4, 1912 - 1992)

నిరంజన

  సెప్టెంబర్ 21, 2021 నిరంజన  ( nir-anjana )       అర్థము      (విశేష్యము): మచ్చ/దోషము లేనిది; అంజన(కాటుక) లేనిది; పున్నమి; శివుడు; మాలిన్యము లేనివాడు - పరబ్రహ్మ     Meaning     (noun) :  blemish-less; full moon; free from passion; Brahman           వాడుక / Usage నిరంజనమైన పరిపాలన అతిశయోక్తిగా మిగిలి పోవలసిందేనా? Is blemish free governance a hyperbole?     మెదడుకు మేత / Food for thought వెంక : మంత్రాలు చదివి దేవుఁణ్ణి ధ్యానం  చెయ్యాలిగాని, అన్నంకోసం  ధ్యానం చేస్తే పాపంకాదా? గిరీ :   ఇగ్నొరెన్స్‌! మతసంబంధమైన సంగతులు నీకేమీ తెలియవు. యీ పెళ్లి అయిపోయిన తరవాత నిన్ను మతంలో తరిఫీదు చెయ్యాలి. అన్నిమతాలూ పరిశీలించి వాటితాలూకు యపెన్స్‌, నిగ్గుతీసి ఓ కొత్తమతం యేర్పర్చాను. అది అమెరికా వెళ్లి ప్రజ్వలింపచేస్తాను. యిప్పడుమట్టుకు నీ సంశయం తీరుస్తాను. యేమన్నావ్‌? అన్నా`న్నా ధ్యానించడం, అని కదూ? యేవఁందోయి నీ ఉపనిషత్తు? "అన్నం బ్రహ్మేతి వ్యజానాత్‌" అన్నవేఁ, బ్రహ్మ. అని తెలు...

నిర్వచనము

  సెప్టెంబర్ 20, 2021 నిర్వచనము  ( nir-vachanamu )       అర్థము      (విశేష్యము): అర్థము వివరించుట; ఒక విషయాన్ని దాని గుణములతో చెప్పడం; లోకోక్తి; మాటలేనిది     Meaning     (noun) : explanation; definition; proverb; (adj) silent           వాడుక / Usage ‘దేశభక్తి’ అనే మాటకు సరైన నిర్వచనం లేదు. గురజాడ ఆ మాటకు మానవతా దృక్పథం ఇచ్చారు. Patriotism is not clearly defined. Gurajada gave it a people centered definition.     మెదడుకు మేత / Food for thought సొంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ ! చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవవలెనోయ్ అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్ ! మతం వేరైతేను యేమోయ్ ? మనసు లొకటై మనుషులుంటే జాత మన్నది లేచి పెరిగీ లోకమున రాణీంచునోయ్ ! దేశమనియెడి దొడ్డవృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనంపంటలు పండవలెనోయ్ ! ఆకులందున అణగి మణగీ కవిత కోయిల పలకవలెనోయ్, పలుకులను విని, దేశమందభి మానములు మొలకెత్తవలె...

పెన

  సెప్టెంబర్ 17, 2021 పెన  ( pena )       అర్థము      (విశేష్యము): బంధనము; లంకె; మెలిక; రెండు పశువులును కలిపి ముడి వేసే త్రాడు     Meaning     (noun) : twist of ropes; a bond; rope tying two animals together           వాడుక / Usage రాజకీయం మరియు మతం విషపూరితంగా పెన వేసుకు పోయాయి. Politics and religion have become poisonously intertwined.     మెదడుకు మేత / Food for thought ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి తియ్యని మనోరధము నా తియ్యని మనోరధం ఫలింప చేయవే ప్రేయసి మనోహరి వరించి చేరవే ప్రేయసి మనోహరి దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ దరిజేరిపోవనేల హృదయవాంఛ తీరువేళ తారక సుధాకరా తపించసాగినే హాయిగా మనోహర వరించి చేరుమా హాయిగా మనోహర మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత మురిసింది కలువకాంత చెలునిచేయి సోకినంత రాగమే సరాగమై ప్రమోదమాయెనే హాయిగా మనోహర వరించి చేరుమా హాయిగా మనోహర ఆ హాహాహ హాహాహ ఆ హాహాహ హాహాహ పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే పెనవేసె మల్లెతీగె మనసులోన మమతరేగే ఊహలో ఒయ్యారమో నా ఊహలో ...

ప్రమోదము

  సెప్టెంబర్ 16, 2021 ప్రమోదము  ( pra-mōdamu )       అర్థము      (విశేష్యము): సంతోషము; ఆనందము; హర్షము     Meaning     (noun) : happiness; joy           వాడుక / Usage ఇంటిలో ఉంటే ప్రమోదము , ఒంటిలో ఉంటే ప్రమాదము. ఏమిటది? Happy to have in the house but dangerous to have in the body. What is it?     మెదడుకు మేత / Food for thought " అయ్యోలూ హమ్మోలు..ఇంతేనా బ్రతుకు హు హు హు.....   ఆహాలూ ఓహొలు..ఉంటాయి వెతుకు హ హ హ.....   మన చేతుల్లోనే లేదా రీమోట్ కంట్రోలు....   ఇట్టే మార్చేద్దాము ఎడుపు గొట్టు ప్రోగ్రాం లు.....   భారీ గా ఫీల్ అయ్యే.. టెన్షన్ లేం పడకు గోలీ మార్. "    వార్తల్లొ హెడ్ లైన్సా... మన కొచ్చే చిలిపి కష్టాలు......    అయొడిన్ తో అయిపోయే.. గాయాలే మనకు గండాలు....    ఎటో వెళ్ళి పోతూ..నిన్ను చూసింది అనుకో ఓ ట్రబులు..    hello..how do u do.. అని అంటోంది అంతే నీ లెవెలు.    ఆతిధ్యం ఇస్తానంటె మాత్రం వస్తుందా...   ...

సుధాకరుడు

  సెప్టెంబర్ 15, 2021 సుధాకరుడు  ( sudhā-karuḍu )       అర్థము      (విశేష్యము): చంద్రుడు; సుధ (అమృతం) వలే హాయి కలిగించు కిరణములు కలవాడు     Meaning     (noun) : moon           వాడుక / Usage మబ్బు చాటునుంచి తొంగి చూసే సుధాకరుడు తన గుట్టు రట్టు చేస్తాడేమోనని కోపగించుకుంది. She cursed the moon angry that it might spill her secret.     మెదడుకు మేత / Food for thought " మిట్టమధ్యానం  నడి నెత్తిన వచ్చాడు ఓంటరిగా పోతుంటే ఎ౦టె౦ట పడ్డాడు ఇనకు౦డా పొతు౦టే అరిచరిచి పిలిచాడు పిలిచి పిలిచి అలుపొచ్చి పైకెక్కానన్నాడు ఎతికి ఎతికి అలకొచ్చి ఏడెక్కానన్నాడు ఆ ఏడి దిగాల౦టే నా తోడు కావాల౦ట నేతోడు ఇస్తాన౦టే తను దిగి వస్తాడ౦ట పొద్దుగూకేయేళ ఎదురుగా వచ్చాడు ఎనుతిరిగిపోతు౦టే ఎనకెనక పిలిచాడు పోని అని తిరిగితేఎరుపెక్కి ఉన్నాడు ఆగి ఆగి అగలేక దిగి వచ్చానన్నాడు చూసి చూసి మత్తెక్కి పిచ్చెక్కి౦దన్నాడు ఆ పిచ్చి దిగాల౦టే నా తోడు కావాల౦ట నే తోడు ఇస్తాన౦టే పొమ్మన్నాపోడ౦ట " --జయసుధ, సినారె  (జులై 29, 1931 - 201...

వాంఛ

  సెప్టెంబర్ 14, 2021 వాంఛ  ( v ancha )       అర్థము      (విశేష్యము): కోరిక; ఆకాంక్ష; సంకల్పము; ఇచ్ఛ      Meaning     (noun) : wish; desire           వాడుక / Usage   జిల్లా ప్రజల చిరకాల వాంఛ , బందరు నౌకాశ్రయం, ఎండ మావిగానే మిగిలిపోతోంది. Long standing desire of the people, Bandar port, continues to be a mirage.     మెదడుకు మేత / Food for thought " పల్లవించవా నా గొంతులో  పల్లవి కావా నా పాటలో ప్రణయ సుధా రాధా నా బ్రతుకు నీది కాదా... నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నేవేనాడొ మలిచావు ఈ రాతిని నేనీనాడు పలకాలి నీ గీతిని... ఇదే నాకు తపమనీ ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది.... నీ ప్రేమకు కలశాన్ని నీ పూజకు నిలయాన్ని నీ వీణకు నాదాన్ని కానా నే ఇన్నాళ్ళు చేసింది ఆరాధన నీకు ఈనాడు తెలిపేది నా వేదన... ఇదే నిన్ను వినమని ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది " --కోకిలమ్మ, ఆచార్య ఆత్రేయ (మే 7, 1921 - 1989)

మనోహరము

  సెప్టెంబర్ 13, 2021 మనోహరము  ( manō-haramu )       అర్థము      (విశేష్యము): బంగారు; భక్ష్యము; ( విశేషణము):  అందమైన; ఇంపైన; మనస్సును దోచుకునే     Meaning     (noun) : gold; vermicelli; (adj): charming; alluring; heart stealing            వాడుక / Usage   ప్రభాత వేళ పక్షుల కిలకిలారావాలతో ఉద్యానవనం మనోహరముగా ఉన్నది. The chirping of the birds at dawn made the garden alluring.     మెదడుకు మేత / Food for thought " వలపు కోయిలలు పాడే వసంతం నీ సొంతం మల్లెల మంటలు రేగిన గ్రీష్మం నా గీతం పున్నమి పువ్వై నవ్విన వెన్నెల నీ అందం ఆ వెన్నెలతో చితి రగిలించిన కన్నులు నా సంగీతం!! ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని  ఆ చితిమంటక చిటపటలే నాలో పలికే కవితలని... ఎవరికి తెలుసు.. మనసుకు మనసే కరువైతే.. మనిషికి బ్రతుకే బరువైతే.... చీకటి మూగిన వాకిట తోడుగ నీడై నా దరి నిలువదనీ జగతికి హృదయం లేదనీ..ఈ జగతికి హృదయం లేదనీ నా జన్మకు ఉదయం లేనే లేదనీ.." -- మల్లెపువ్వు, వేటూరి (జనవరి 29, 1936 - 2...

ఘనము

  సెప్టెంబర్ 10, 2021 ఘనము  ( ghanamu )       అర్థము      (విశేషణము): దట్టమైనది; విరివి; గొప్పతనము; ఒక సంఖ్య వర్గాన్ని అదే సంఖ్యతో గుణిస్తే వచ్చేది; వేద పఠనంలో ఒక పద్ధతి     Meaning     (adjective) : solid; dense; greatness; cube of a number; type of Vedic recitation            వాడుక / Usage   ఘన పాఠం వంటి క్లిష్టమైన వల్లె వేసే పద్దతులతో వేదాల శుద్ధత్వం యుగయుగాలుగా నిలిచింది.  With oral traditions like Ghana Paatham the correctness/sanctity of Vedas has been maintained.     మెదడుకు మేత / Food for thought " తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచ పడియెదవు సంగతేమిటిరా?  అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా... ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. ప...

ప్రజాతి

  సెప్టెంబర్ 09, 2021 ప్రజాతి  ( prajathi )       అర్థము      (విశేష్యము):  జీవుల శాస్త్రీయ వర్గీకరణ పద్ధతిలో ఒక వర్గం - జాతుల సమూహం; పుట్టుట; ప్రసవం     Meaning     (noun) : genus; birth           వాడుక / Usage   మాగ్నోలియా అనేది పుష్ప సామ్రాజ్యం లో సుమారు 210 పుష్పించే మొక్క జాతుల ప్రజాతి .  Magnolia is a genus comprising of 210 flowering species.     మెదడుకు మేత / Food for thought " ఈ ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని, తనను తాను ఉద్దరించుకునే మేధస్సును మానవుడు అంతరాత్మ ద్వారా సాధించాడు. అయితే విజ్ఞాన శాస్త్ర పరిధిలో అది చాలా చిన్న అడుగు మాత్రమే. సంఘర్షణ, పరిశోధకత్వం మానసిక స్థాయిలోనే జరిగింది. ఈ అంశాన్ని నేను ద్రవస్ఫటికాలను అధ్యయనం చేసినప్పుడు గ్రహించాను. ఇవి ఏకకణ సూక్ష్మ జీవి (అమీబా) భౌతిక ధర్మాలను కలిగి ఉంటాయి. ప్రాణశక్తి మాత్రం గ్రహాంతర రోదసి నుంచి లభించింది. ఈ జీవ శక్తి ఏదో తెలియని కారణాల వల్ల విచిత్రంగా ద్రవస్ఫటికాల తరహా పదార్థాలలో ప్రవేశించి వుంటుందని నా అభ...