Posts

Showing posts from April, 2026

ఉప్పతిల్లు

  మే 01, 2025 ఉప్పతిల్లు   ( uppatilu )     అర్థము      (క్రియ)  : పుట్టు; కలుగు; సంభవించు    Meaning     (verb )  : to be born/produced/made      వాడుక / Usage     ఆ వేదవాక్కు తన్మహానిభృత ప్రచలన్మధురధ్వానమున ఉప్పతిల్లి ఉద్గీథము వలె ఉన్నది .     That Vedic chant, self emanating and sonorous, was like the Samaveda .    మెదడుకు మేత / Food for thought     పలుకరాదటే చిలుకా పలుకరాదటే     సముఖములో రాయబారమెందులకే    ఎరుగని వారమటే? మొగమెరుగని వారమటే!    పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే    ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే    మనసున తొణికే మమకారాలు    కనులను మెరిసే నయగారాలు    తెలుపరాదటే సూటిగా, తెరలు తీసి పరిపాటిగా    -- షావుకారు (1950), సముద్రాల రాఘవాచార్య

నిమీలితము

  ఏప్రిల్ 30, 2025 నిమీలితము   ( nimeelithamu )     అర్థము      (విశేషణము)  : మూయబడినది; ఆస్తమించినది    Meaning     (adj )  : closed; shut      వాడుక / Usage     అర్ద నిమీలిత నేత్రముల యందు; తన్మనోగత సౌకుమార్యము, ఠీవి, రసజ్ఞత గోచరించుచుండెను .     In the half closed eyes; the innate tenderness, splendour and aesthetic were evident.    మెదడుకు మేత / Food for thought      పయనించే..ఓ..ఓ.. ఓ... చిలుకా      ఆ...ఆ....ఆ....ఆ...ఆ..      పయనించే ఓ చిలుకా      ఎగిరిపో..పాడైపోయెను గూడు      పయనించే ఓ చిలుకా      ఎగిరిపో..పాడైపోయెను గూడు      పయనించే ఓ చిలుకా      ఆ...ఆ...ఆ...ఆ...        తీరెను రోజులు నీకీ కోమ్మకు...      కోమ్మా ఈ గూడు వదలి      తీరెను రోజులు నీకీ కోమ్మకు...      కోమ్మా ఈ గూడు వదలి ...

పైడికంటి

  ఏప్రిల్ 29, 2025 పైడికంటి   ( paidi-kanti )     అర్థము      (విశేష్యము)  : బంగారు రంగు కన్నుల పక్షి/గూబ; దీని కూత శుభ సూచకం    Meaning     (noun )  : golden eyed; spotted owlet      వాడుక / Usage     ఆలయమునకు ప్రాగ్దిశయందున్న అశ్వత్థవృక్షాగ్రమున రెండు పైడికంటులు కిలకిల కూసెను .     Two spotted owlets called from the Aswattha tree to the east of the temple.    మెదడుకు మేత / Food for thought      ఓ ..... ఓ ప్రియతమా      పోదువో ఓ ప్రియతమా      పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా      కరగునులే తారకలు మోముదాచె రేరాజు      రగులునె నా మదిలో ఏదో తీరని బాధ ప్రియతమా      పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా      విధి బలీయమని తెలుసు తెలుసు నాకు నీ మనసు      తనువులు వేరైనా మన మనసొకటేనే ఓ ప్రియతమా      పయనమయే ప్రియతమా నను మరచిపోకుమా ఓ ప్రియతమా  ...

వితర్ది

  ఏప్రిల్ 28, 2025 వితర్ది   ( vithardi )     అర్థము      (విశేష్యము)  : అరుగు; వేదిక    Meaning     (noun )  : a raised ground/platform; dais      వాడుక / Usage     ముఖమంటపము ముందు ధ్వజస్తంభం దాక నొక పెద్ద శిలా వితర్ది క యున్నది .     There is a raised platform made of stone, in front of the pillared porch till the temple mast.    మెదడుకు మేత / Food for thought      ప్రేమే నేరమౌనా...      వేదనగానే మా వలపంతా వేశారూనా      ప్రేమే నేరమౌనా...      దేవ దయానిధివే నీవు.. మా మొర వినవేలా      పావనప్రేమను పాతకమనిపించి      వేరుగ జేసేవా... మమ్ము వేరుగ జేసేవా      ప్రేమే నేరమౌనా...      కన్నుల వెలుగును కానక ఇలలో      గన్నవారే మా కంటను నిప్పులు      పన్నని వలపుల కన్నీరుగ మార్చేరా      మమ్ము కన్నీరుగ మార్చేరా    ...

పుచ్ఛము

  ఏప్రిల్ 27, 2025 పుచ్ఛము   ( puchchhamu )     అర్థము      (విశేష్యము)  : తోక; వెనుక పక్క    Meaning     (noun )  : tail; hinder part      వాడుక / Usage     అష్టమినాడు ప్రొద్దు క్రుంకినంతనే వెన్నెలలు సితమత్స్య పుచ్ఛ రోచులు వెలిగ్రక్కెను .     On the eighth day of the waxing fortnight as the Sun set, moon light shone like the tail of white fish.    మెదడుకు మేత / Food for thought      చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ      చెలియ లేదూ చెలిమి లేదు వెలుతురే లేదూ      వున్నదంతా చీకటైతే వుంది నీవేలే      వున్నదంతా చీకటైతే వుంది నీవేలే మిగిలింది నీవేలే      చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె      చెలిమి పోయే చెలువు పోయే నెలవే వేరాయె      చేరదిసి సేవచేసే తీరూ కరువాయే      చేరదిసి సేవచేసే తీరూ      కరువాయే నీ దారె వేరాయె ||చెలిమి||   ...

తావళము

  ఏప్రిల్ 24, 2025 తావళము   ( tāvaḷamu )     అర్థము      (విశేష్యము)  : దండ; మాల; రుద్రాక్షలు గుచ్చిన గొలుసు    Meaning     (noun )  : a necklace of beads; rosary; garland      వాడుక / Usage      రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వ్రేలాడదీసే మూడు తావళాలు .     Three garlands - one each from the elbow, one from the waist hanging over the knees and touching the feet.    మెదడుకు మేత / Food for thought     ఈ సఫలమైన ఆనందం కన్న, ఆ తీరని వేదన ఎక్కువ వాంఛనీయమేమో! ఏ సుఖం కష్టాలనే అలల మీద యీ ప్రపంచం వూగుతోందో, ఆ సుఖదుఃఖ భేదం - నిజంగా ఆ భేదం వుందా? ఆనందం దొరకగానే, ఎన్నేళ్లో పడ్డ బాధంతా పడనట్టే తోస్తుంది. కాని ఆ ఆనందం యిట్లా వేళ్ళలోంచి జారి ... యింకేముంది బాధకాక అనిపిస్తుంది. ఆ రాత్రి - ఆ పూర్వపు రాత్రి - ఆమె తెల్లారి వెళ్ళిపోతుందే, తక్కిన రాత్రినంతా కూడా మాధుర్యంతో నింపగల శక్తి యీ నరాలకి లేకపోయిందే అని దుఃఖించడంతో గడిం...

పరిహారము

  ఏప్రిల్ 23, 2025 పరిహారము   ( pari-hāramu )     అర్థము      (విశేష్యము)  : విడుపు; పోవుట; యోచనము; ఉపాయము    Meaning     (noun )  : removal; remedy; giving up; cure      వాడుక / Usage      దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి.     Damaged crops should be compensated (remedied).    మెదడుకు మేత / Food for thought     "బాగా జరిగింది. ఆడది హద్దుమీరి లోకం మీద పడడమా? తురకాళ్లు, మంగలాళ్లు స్నేహితులా! పో , లాక్కుపో, భర్తవి, అధీనం చేసుకో!" అంటోంది నాకు తెలియకుండా, కులం నిరాకరించిన నా కులాభిమానం, మతం లేదనే నా మతాభిమానం, స్త్రీ స్వేచ్ఛకోసం పోట్లాడే పురుష అహంకారం, జెలసీ. చచ్చాయనుకున్న ఆ ముళ్ల మొక్కల మోళ్లన్నీ చిగిర్చాయి, ఆ రాత్రి ప్రవహించిన కుళ్ళనీళ్ళలో.     - అరుణ (1935), చలం

సమకూర్చు

  ఏప్రిల్ 22, 2025 సమకూర్చు   ( sama-kūrchu )     అర్థము      (క్రియ)  : ఏర్పాటు చేయు; సాధించు    Meaning     (verb )  : bring about; produce; to arrange      వాడుక / Usage      చాలీచాలని తరగతి గదులు, అరకొరగా ప్రయోగ పరికరాలు - నిధులివ్వరు.. వసతులు సమకూర్చరు .     Barely enough classrooms, scanty lab equipment - neither funds nor facilities provided.    మెదడుకు మేత / Food for thought     స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటంగాని, మనని బంధించి నిలబెట్టే యీ దేశం, సంఘం, కట్టుబాట్లు, మర్యాదలు, ఈ నాచురల్ లాస్, ఫీజికల్ లాస్, సోషల్ లాస్ సరిగా పని చేస్తున్నంతసేపే, మన స్వేఛ్చ వాదాలు ప్రయాణాలు - శరీరం సరిగా పని చేస్తున్నంత సేపే అపత్యాలు శరీరపు నిబంధనలకి యెదురుతిరగడాలు! గంతులూ!     - అరుణ (1935), చలం

జీరాడు

  ఏప్రిల్ 21, 2025 జీరాడు   ( jīrāḍu )     అర్థము      (క్రియ)  : వ్రేలాడు; కొంగు లేక వస్త్రం యొక్క అంచు నేలపై పారడం    Meaning     (verb )  : cloth hanging down or trailing on the ground      వాడుక / Usage      కుచ్చిళ్లు జీరాడు కోక కట్టి...ఆ కొంగులోన దోరవయసు దాచిపెట్టి.. నిలు నిలు నిలవమంటే నా తరమా.     Frills of the saree trailing, nubile youthfulness furtively hidden; bear I cannot.    మెదడుకు మేత / Food for thought     ఈ కొత్త కాలంలో కొత్త ఊహల్లో కొత్త పిలుపుల్లో కొత్త వాతావరణంలో, ఆత్మని నలుదిక్కులకి కొత్త ఆశలు పెట్టి అశాంతిపరిచే కొత్త కాంతుల్లో, స్త్రీని పాత గూళ్ళలో, తుక్కుపురాణ నీతుల్లో, నవీన జీవితానికి ఏ సంబంధము లేక పుచ్చిన నీతి నిబంధనల్లో, కుళ్ళిన ముసలమ్మల శాసనాల్లో, దుర్భరమైన గృహాల్లో కళ్లుమూసి, బంధించి ఉంచాలని చూసే నేర్పుగల దూర్తలోకం.     - అరుణ (1935), చలం

ఆలింగనము

  ఏప్రిల్ 20, 2025 ఆలింగనము   ( ālinganamu )     అర్థము      (విశేష్యము)  : కౌగిలింత    Meaning     (noun )  : an embrace      వాడుక / Usage      కోహ్లీపై మెక్‌గ్రాత్ ప్రశంసలు, పంత్‌కు ఓనర్ ఆత్మీయ ఆలింగనం !     McGrath showers praises on Kohli, owner gives a hearty hug to Pant.    మెదడుకు మేత / Food for thought     ఏం చేశావా? సుందరమైన కీర్తనలో..ఏం తాళం ఏం రాగం అని అడుగుతున్నావు. అనుభవించడం చేతగాక! "ఇదివరకు ఏమైనావు, ఇక ఏమవుతావు?" ఎందుకవన్నీ?! వెన్నెట్లో కూచుని 'చంద్రుడు అస్తమిస్తాడే - నిన్న ఉదయించలేదే' అని ఏడ్చే నిర్భాగ్యుణ్ణి నిన్ను చుశానుగాని! స్త్రీ వొళ్ళో ఎన్నాళ్ళు కూచుంటుంది? చంద్రుడు ఎంతసేపు వెలుగుతాడు? వెలిగితే... నిద్రపోతావు. అట్లానే (నేను) నిలిస్తే ఈ సౌందర్యం భరించగలవా నాయనా? ఎంత వేదాంతం బోధించింది ఆ కొంచం మాటల్లో? జన్మంతా కృతజ్ఞుణ్ణి!      - అరుణ (1935), చలం

తరుణము

  ఏప్రిల్ 17, 2025 తరుణము   ( taruṇamu )     అర్థము      (విశేష్యము/విశేషణము)  : సమయం; కొత్తది; యౌవనము కలది    Meaning     (noun/adj )  : time; opportune moment; tender; young      వాడుక / Usage      చీకటి ఆలోచనలను చెల్లా చెదరు చేసాడు అనంత విశ్వాన్ని తెలుసుకున్న తరుణం లో.     The moment he realised the Oneness of the infinite Universe, darkness of his thoughts was destroyed.    మెదడుకు మేత / Food for thought      జ్ఞానాన్ని ఇతరులకు బోధించలేము. తాను తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు చెప్పడానికి ప్రయత్నిస్తే  అది మిగతావారికి ఎప్పుడూ అవివేకంగానే వినిపిస్తుంది... పాండిత్యం నేర్పించవచ్చు, కానీ జ్ఞానాన్ని కాదు. జ్ఞానాన్ని పొందవచ్చు, దానితో జీవించవచ్చు, దాని ద్వారా అద్భుతాలు చేయవచ్చు, కానీ దానిని ఇతరులకు అందించలేము, బోధించలేము. అది ఎవరికివారు కనుగొనాలిసిందే.     - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్

బడలిక

  ఏప్రిల్ 16, 2025 బడలిక   ( baḍalika )     అర్థము      (విశేష్యము)  : అలసట; శ్రమ    Meaning     (noun )  : fatigue; exhaustion      వాడుక / Usage      అహోరాత్రులు బడలిక లేక పయనించే బాటసారయ్యాడు సముద్రపు కెరటాలపై తేలుతో నీ జాడకై.     He became the incessant tireless traveller, in your search, gliding on the waves of Samsara.    మెదడుకు మేత / Food for thought      నా గురించి నాకు ఏమీ తెలియకపోవడానికి, సిద్ధార్థుడు నాకు పరాయివాడిగా, అపరిచితుడిగా మిగిలిపోవడానికి కారణం ఒక్కటే, ఒకే ఒక్క విషయం - నాకు  నేనే  భయపడ్డాను, నా నుండే పారిపోయాను. నేను ఆత్మను, బ్రహ్మాన్ని వెతికాను; నన్ను నేను ముక్కలు చేసి, నా పైపొరలను చీల్చి, ఆ పొరల నడిబొడ్డున ఉన్న ఆత్మను, జీవాన్ని, దైవిక సూత్రాన్ని, పరమ సత్యాన్ని కనుగొనాలని నిశ్చయించుకున్నాను. కానీ అలా చేయడంలో, నన్ను నేను కోల్పోయాను.     - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

భావుకుడు

  ఏప్రిల్ 15, 2025 భావుకుడు   ( bhavukuḍu )     అర్థము      (విశేష్యము)  : భావనల/కాల్పనిక ప్రపంచంలో విహరించేవాడు; కళాహృదయుడు    Meaning     (noun )  : emotional, imaginative person; artistic person      వాడుక / Usage      మనుజుడు భావుకుడు చకితుడైయున్నాడు నీ దివ్యత్వాన్ని చవిచూచి.     Man is made of emotions; awestruck he is, having experienced your divinity.    మెదడుకు మేత / Food for thought      కాలం అనేదే లేదు అనే ఆ రహస్యాన్ని నువ్వు కూడా నది నుండి నేర్చుకున్నావా? నది ఒకే సమయంలో ప్రతిచోటా ఉంటుంది, దాని జన్మస్థానం వద్ద, సాగరముఖం వద్ద, జలపాతం వద్ద, పడవ రేవు వద్ద, ప్రవాహంలో, సముద్రంలో, పర్వతాలలో, ప్రతిచోటా; దానికి వర్తమానం మాత్రమే ఉనికిలో ఉంటుంది, గతం యొక్క నీడ గానీ, భవిష్యత్తు యొక్క నీడ గానీ కాదు.     - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

ఎడబాటు

  ఏప్రిల్ 14, 2025 ఎడబాటు   ( eḍa-bāṭu )     అర్థము      (విశేష్యము)  : ఎడ=దూరం; దూరంగా ఉండటం; వియోగం    Meaning     (noun )  : separation by distance      వాడుక / Usage      నీ ఎడబాటు తాళలేడు మానవుడు, అందుకే నీ నీలి మడుగుల కళ్ళలోకి తదేకంగా చూస్తాడు.     Distance from you, man can bear not; he looks into your deep blue eyes intently.    మెదడుకు మేత / Food for thought      మాటలు, ఆలోచనలను అంత బాగా వ్యక్తపరచలేవు. వాటిని వ్యక్తపరిచిన వెంటనే అవి ఎప్పుడూ కొద్దిగా భిన్నంగా, కొద్దిగా వక్రీకరించబడి, కొద్దిగా అవివేకంగా మారిపోతాయి. అయినప్పటికీ, ఒక వ్యక్తికి విలువైనది మరియు జ్ఞానమైనదిగా అనిపించేది మరొకరికి అర్థరహితంగా అనిపించడం నాకు బాధ అనిపించదు, పైగా సరైనదిగా కూడా అనిపిస్తుంది.     - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

తంత్రి

  ఏప్రిల్ 13, 2025 తంత్రి   ( tanthri )     అర్థము      (విశేష్యము)  : నరము; తీగ; త్రాడు; గాయకుడు    Meaning     (noun )  : wire; string of a musical instrument; singer      వాడుక / Usage      తెగిన వీణా తంత్రులు తిరిగి కలపాలని ఆదేశించవా?     Will you not order that the broken strings of Veena be restrung?    మెదడుకు మేత / Food for thought      "ఎవరైనా అన్వేషించినప్పుడు, అతని కళ్ళు అతను అన్వేషించే వస్తువు కోసం మాత్రమే చూస్తాయి. అతను దేనినీ కనుగొనలేడు, దేనినీ గ్రహించలేడు. ఎందుకంటే అతను ఎల్లప్పుడూ తాను అన్వేషించే దాని గురించే ఆలోచిస్తాడు. అతనికి ఒకే లక్ష్యం ఉంటుంది. అతను తన లక్ష్యంతో నిమగ్నమై ఉంటాడు. అన్వేషించడం అంటే: ఒక లక్ష్యం కలిగి ఉండటం. కానీ కనుగొనడం అంటే: స్వేచ్ఛగా, నిష్కపటంగా ఉండటం, ఏ లక్ష్యమూ లేకుండా ఉండటం" అని సిద్ధార్థుడు అన్నాడు.     - సిద్ధార్థ (1922), హెర్మన్ హెస్ 

అజ్ఞాతము

  ఏప్రిల్ 10, 2025 అజ్ఞాతము   ( agnathamu )     అర్థము      (విశేషణము)  : తెలుసుకోలేనిది; తెలియబడనది    Meaning     (adj )  : incognito; what cannot be known/found      వాడుక / Usage      అంతులేని అంతుచిక్కని అజ్ఞాత దూర తీరాలకు కొట్టుకుపోయాడు మనిషి, కడతేరని తీరని ఆశల అలల కడలిలో.     The endless, never reachable, unknown banks of yonder, man has been swept away in the indefatigable waves of desire.    మెదడుకు మేత / Food for thought       ఆత్మయందే దృష్టి ననువగా నొనరించి      నిశ్చలముగా దృష్టి నిలిపెనేని     అతడునీవె నమ్మి యనుమానమేలరా      విశ్వదాభిరామ వినుర  వేమ!     -- వేమన

ప్రభాతము

  ఏప్రిల్ 09, 2025 ప్రభాతము   ( prabhātamu )     అర్థము      (విశేష్యము)  : ఉదయకాలం; తెల్లవారు వేళ; వేకువ    Meaning     (noun )  : dawn; day break; morning      వాడుక / Usage      మనిషి ప్రభాత భాస్కరుని తేజాన్ని రాగాలలో పులుముకున్నాడు యెడతెగని తన యానం వెలుగుల బాట అవ్వాలని.     Man wrapped the radiance of the morning Sun in his ballads; to light the path on his incessant journey.    మెదడుకు మేత / Food for thought       అంతరంగమందు నపరాధములు చేసి      మంచి వానివలెనే మనుజుడుండు     ఇతరులెఱుగకున్న నీశ్వరుడెఱుగడా      విశ్వదాభిరామ వినుర  వేమ!     -- వేమన

విడ్డూరము

  ఏప్రిల్ 08, 2025 విడ్డూరము   ( vidduramu )     అర్థము      (విశేష్యము)  : వింత; మూర్ఖత్వం; మొండితనం    Meaning     (noun )  : unnatural; obstinacy; stubbornness      వాడుక / Usage      ఎంతో విడ్డూరంగా స్వప్నాలలో అవధులు లేని విశ్వ సౌందర్యం జాలు వారగ.     Ethereal dreams of boundless beauty flow incessantly.    మెదడుకు మేత / Food for thought     పరగ ఱాతిగుండు బగులగొట్టగ వచ్చు    గొండలన్ని పిండి గొట్టవచ్చు    కఠిన చిత్తు మనసు కరిగింపగారాదు    విశ్వదాభిరామ వినుర  వేమ!     -- వేమన

సౌధము

  ఏప్రిల్ 07, 2025 సౌధము   ( saudhamu )     అర్థము      (విశేష్యము)  : మేడ; భవనము; రాజ గృహము    Meaning     (noun )  : mansion; palace      వాడుక / Usage      ఓ భగవంత! నీ ప్రేమ సౌధం చేరాలని మనిషిని ఇలా సృజించావా?     Bhagavan! Did you create us like this so that we can attain your edifice of love?    మెదడుకు మేత / Food for thought       చిక్కియున్నవేళ సింహంబునైనను      బక్క కుక్క కఱచి బాధ పెట్టు      బలమిలేని వేళవంతంబు చెల్లదు     విశ్వదాభిరామ వినుర వేమ!     -- వేమన

శోకతప్తము

  ఏప్రిల్ 06, 2025 శోకతప్తము   ( soka-tapthamu )     అర్థము      (విశేషణము)  :  దుఃఖంతో నిండిన ,  బాధతో తపించిపోవడం;  తీవ్రమైన వేదనలో ఉండడం    Meaning     (adj )  : sorrowful; agitated by grief      వాడుక / Usage      అగమ్య గోచరమైన జీవనంలో, మసకబారిన కనులతో శోకతప్త భాష్పాలు కారని మనిషి ఎవడైనా ఉన్నాడా?     Life bereft of direction, warm tears of agony welling from eyes; is there anyone not like this?    మెదడుకు మేత / Food for thought       నిదుర లేనిది ఈ రేయి, నిదుర లేనిది ఈ రేయి     మరుల రాణి, మల్లెల బాణి, రెప్ప వేయకోయి     చలువ వెన్నెలలూరే నీ గదిలో     వలపుల మిణుగురుల     తారకలు చూడుమా     ఆశల శ్వాసల చుక్కలు     వినువీధిన కనుమా.     అవును నా నిజం నాకే అంతర్గతం     తెలియదెవ్వరికీ నా నామధేయం     ఎవ్వరికీ..అసలెవ్వరికీ...     రవి కిరణం భువి తాక...