Posts

Showing posts from September, 2025

కొరత

  అక్టోబర్ 01, 2025 కొరత  ( koraṭha )     అర్థము    (విశేష్యము)  : తక్కువ; అవసరానికి సరిపడ సరుకులు లేకపోవడం    Meaning    (noun) : scarcity; incompleteness      వాడుక / Usage       ఆర్థిక శాస్త్రాన్ని "అపరిమితమైన మానవ కోరికలను, వాటిని తీర్చడానికి ఉన్న కొరతైన వనరులను అధ్యయనం చేసే శాస్త్రం" అని నిర్వచించినది లియోనెల్ రాబిన్స్.     Lionel Robins postulated Economics as the study of unlimited human wants and the scarce resources available to satisfy them.    మెదడుకు మేత / Food for thought     'క్షుద్ర సాహిత్యం' అని సీరియస్ పాఠకులు ముద్ర వేసిన సాహిత్యాన్ని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తన 'తులసీదళం' (1980) నవలతో శక్తిమంతంగా తెలుగునాట ప్రవేశపెట్టారు. యండమూరి - వెన్నెల్లో ఆడపిల్ల, డబ్బు టు ది పవర్ ఆఫ్ డబ్బు, అంతర్ముఖం వంటి నవలలతో పాప్యులర్ అయ్యారు. దానికి ముందు నాటకాలు రాశారు. అనేక సినిమాలకు పని చేశారు. స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా.     -- కథలు ఇలా కూడా రా...

శ్రేయస్సు

  సెప్టెంబర్ 30, 2025 శ్రేయస్సు  ( ṣrēyassu )     అర్థము    (విశేష్యము)  : శుభము; మంచి; మోక్షము    Meaning    (noun) : welfare; good; well being      వాడుక / Usage       సంపదను అధ్యయనం చేసే సంప్రదాయ నిర్వచనాల నుండి భిన్నంగా, ఆల్ఫ్రెడ్ మార్షల్ ఆర్థిక కార్యకలాపాల ద్వారా ప్రజల శ్రేయస్సును పెంచడంపై దృష్టి సారించారు.     Contrary to traditional theories of economics focused on wealth, Alfred Marshall looked at economic activities aiding the welfare of people.    మెదడుకు మేత / Food for thought     మధ్య తరగతి జీవితాన్ని పాప్యులర్ నవలా రచనలో ఇమడ్చవచ్చని నిరూపించిన రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి. చిక్కుడు గింజల వేపుడు లాంటి మధ్య తరగతి దైనందినిక ప్రస్తావనలు చంటబ్బాయ్ నవలలో కనిపిస్తాయి. లెక్కకు మించిన వ్యాపార నవలలు, ట్రావెలోగ్స్, ఆ తర్వాత ఆధ్యాత్మిక సాహిత్యం కూడా వెలువరించారు. స్వస్థలం విజయవాడ.     -- కథలు ఇలా కూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

సంపద

  సెప్టెంబర్ 29, 2025 సంపద  ( sampada )     అర్థము    (విశేష్యము)  : ఆస్తి; ఐశ్వర్యం    Meaning    (noun) : wealth      వాడుక / Usage       వ్యక్తులు సంపదను పెంచుకోవడానికి కృషి చేస్తే దేశ సంపద పెరుగుతుందని  ఆడమ్ స్మిత్ ప్రతిపాదన .     According to Adam Smith, if individuals work to increase their wealth, the wealth of the nation increases.    మెదడుకు మేత / Food for thought     పిల్లల పత్రికగా వాసికెక్కిన చందమామ బి.నాగిరెడ్డి-చక్రపాణిల సారథ్యంలో 1947లో స్థాపితం. ఒక్కో భాషలో మొదలవుతూ సింహళ, సంతాలి భాషల్లో కూడా ఆదరణ పొందింది. కథా రచయితలకు సులభమైన వచనం రావాలంటే చందమామ పాత పత్రికలు సేకరించి చదవాలని చాలామంది అభిప్రాయం.     -- కథలు ఇలా కూడా రాస్తారు, మహమ్మద్ ఖదీర్ బాబు

పొలయలుక

  సెప్టెంబర్ 26, 2025 పొలయలుక  ( polayaluka )     అర్థము    (విశేష్యము)  : ప్రేమ కలహం; ప్రణయ కోపం    Meaning    (noun) : lover's quarrel      వాడుక / Usage       చెలుల పొలయల్కలే ప్రేమజీవకళలు పానకమునకు మిరియంపుఁ బసలు వోలె.     Anger of a damsel in love enlivens romance; much as spices in a sweet syrup.    మెదడుకు మేత / Food for thought      యాస్యత్యద్యశకుంతలేతిహృదయం సంస్పృష్ట ముత్కంఠయా,      కంఠస్తంభితభాష్పవృత్తికలుష శ్చిన్తాజడందర్శనమ్,      వైక్లబ్యమమ తావదీదృశమహో స్నేహాదరణ్యౌకసః,      పీడ్యంతే గృహిణః కథన్ను తనయా విశ్లేషదుఖైర్నవైః!!     (ఈరోజు శకుంతల అత్తవారింటికేగుచున్నదని నా హృదయమేలనో తత్తరపడుచున్నది. ఒక్క మారుగా తెలియని విషాదము నా హృదమునాక్రమించినది. కన్నుల నీరూనుట కంఠము బొంగురు వోయినది. కనుచూపు మసకబారినది. ఏదో ఒకింత కాలము పెంచిన నాకే యిట్లున్నదే, నిజముగా తాము కని పెంచిన కూతురు నత్తవారింటికి పంపునపుడా ...

వాదర

  సెప్టెంబర్ 25, 2025 వాదర  ( vaadara )     అర్థము    (విశేష్యము)  : కత్తి యొక్క పదునైన అంచు; (పత్తి) బట్టలు; ఎరువులు; పనిముట్లు    Meaning    (noun) : edge of a sword; clothes; fertilisers; tools      వాడుక / Usage       దుర్గా మాత ధరించే ఖడ్గం కత్తి వాదర వలే పదును గల జ్ఞానాన్ని సూచిస్తుంది.     The sword of Mother Durga signifies the sharpness of Gnana.    మెదడుకు మేత / Food for thought      శుశ్రూషస్వ గురూన్ కురుప్రియసఖీ వృత్తిం సపత్నీజనే,      భర్త్ృర్విప్రకృతాపి రోషణతయా,మాస్మప్రతీపంగమః,      భూయిష్టంభవ, దక్షిణాపరిజనే భాగ్యేష్వనుత్సేకినీ,      యాంత్యేవం గృహిణీపదం యువతయోః వామాః కులస్యాధయః!     (అమ్మా!నీయత్తవారింట పెద్దలను సేవింపుము. సవతులయెడ స్నేహమును ప్రదర్శింపుము, నీభర్త కోపగించినా నీవును కోపముతో నెదురాడకుము. విముఖతను జూపకుము. ధనమున్నదని విర్రవీగక సేవకులయెడ దయను జూపుము. ఆడపిల్ల అత్తింట ఈ తీరున మెలగి...

ఇరుసు

  సెప్టెంబర్ 24, 2025 ఇరుసు  ( irusu )     అర్థము    (విశేష్యము)  : బండి(లేక మోటబావి)  చక్రాలకు/ గిలకకు  అడ్డంగా వేసే కడ్డి; ఆక్షము    Meaning    (noun) : an axle; crossbeam on a water wheel      వాడుక / Usage       వాహనం యొక్క ఇరుసు పైకి కదలకుండా నిరోధించడానికి చక్రాల పైన రోలర్ సెట్‌ను అమర్చారు.     A roller set was attached on the top to prevent the axle from moving up.    మెదడుకు మేత / Food for thought      అస్మాన్ సాధువిచింత్య,సంయమధనాన్ ఉచ్చైఃకులంస్యాత్మనః      త్వయ్యస్యాః కథమప్యబాంధవకృతం స్నేహప్రవృత్తించ తాం      సామాన్య ప్రతిపత్తిపూర్వకమియం ,దారేషుదృశ్యాత్వయా,     భాగ్యాయత్తమతఃపరం ,నఖలు,తద్వాచ్యం వధూబంధుభిః!! (అనునయం -  మేమా ధనవంతులముగాము, తపమే మాకు గల ధనము,మా పిల్ల అడవులలో పెరిగినది. కల్లకపటము లెరుగనిది. మాయ మాటలు చెప్పి దానినెట్లో వశపరచుకొన్నావు. మాకుగూడా చెప్పుకొనలేని నీపై దానికి గల ప్రేమ య...

కలబంద

  సెప్టెంబర్ 23, 2025 కలబంద  ( kalabanda )     అర్థము    (విశేష్యము)  : ఔషధ లక్షణాలు గల ఒక చెట్టు; కంచె మొక్కగా వేసే ఒక మొక్క    Meaning    (noun) : Aloe vera; plant with thorny thick leaves used for fencing      వాడుక / Usage       కలబంద జ్యూస్ తాగితే ఊహకందని ఉపయోగాలు.. తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది మీరే!     Drinking Aloe vera juice is incredibly useful...under estimate it at your own peril!    మెదడుకు మేత / Food for thought      పాతుం న ప్రథమం వ్యవస్యతిజలం యుష్మాస్వపీతేషు,యా      నాధత్తే ప్రియమండనాపి భవతాం స్నేహేన యా పల్లవమ్,      ఆద్యే వః కుసుమప్రసూతిసమయే,యస్యాభవత్సుత్సవమ్,      సేయం యాతి శకుంతలా!పతిగృహం  సర్వైరనుజ్ఞాయతామ్!! (మీకు నీరు పోయకుండా ఎవరైతే  నీరుత్రాగదో, ప్రియమైన ఆభరణమైనను మీపై ప్రేమతో చిగురుటాకు  ఎవరైతే  తుంచదో, మీరు పూలు పూయునప్పుడు  ఎవరైతే  పండగజేసికొనునో, అట్టి మీ ప్ర...

అగచాట్లు

  సెప్టెంబర్ 22, 2025 అగచాట్లు  ( agaṭsāṭlu )     అర్థము    (విశేష్యము)  : అగచు (దురదృష్టం) + ఆటు (దెబ్బ/బాధ) + లు = కష్టాలు; ఆపదలు    Meaning    (noun) : troubles; calamities; afflictions      వాడుక / Usage       యూరియా కోసం అన్నదాతల అగచాట్లు .     Farmers struggle to get Urea.    మెదడుకు మేత / Food for thought     నవ యవ్వన వత్సరాల మొగ్గలను, ముదుసరి సంవత్సరపు మధుర ఫలాలను     మనలను మురిపించేవి, మనసుని ముగ్ధం చేసేవి, తనువును సంతృప్తిపరిచేవి, ఆత్మ శృంఖలలు తెంచేవి     గగనానిని, భువనానిని - ఒక్క పేరుతో ఒకే ఒక్క పదంలో అభివర్ణించ తరమా     ఘోషిస్తాను నేను ఒక్కటే, 'ఓ శకుంతలా', సర్వస్వం అందు నిఘాడం సమస్తం అందే నిక్షిప్తం     -- జోహాన్ వోల్ఫ్‌గ్యాంగ్ గోథే, కవిసామ్రాట్ కాళీదాసు విరచిత అభిజ్ఞాన శాకుంతలం చదివి మైమరచిపోయి వ్రాసిన జర్మన్ కవితకు అనువాదం

మాలిమి

  సెప్టెంబర్ 19, 2025 మాలిమి  ( mālimi )     అర్థము    (విశేష్యము)  : వాత్సల్యము; ప్రేమ; ఓడ నడిపే శాస్త్రం; మచ్చిక    Meaning    (noun) : love; affection; fondness; science of navigation; tameness      వాడుక / Usage       మాలిమి చేసిన ఏనుగు కాలిమీద అడుగుపెట్టి పైకి ఎక్కి ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని అడవిలో తిరిగాను.     I sat on tamed elephants, by climbing on their legs, and roamed the forest.    మెదడుకు మేత / Food for thought      “వచ్చి తీసుకెళ్ళిపోతాయి, నువ్వు రా” అని డాక్టర్ చెప్తూ వెనక్కి తిరిగినప్పుడు ఉన్నట్టుంది ఇరవైకి పైబడిన ఘీంకారాలు కోరస్‌గా పెద్ద ఎత్తున వినిపించాయి. నా ఒళ్ళు పులకరించింది! కళ్ళనుండి నీళ్ళు కారిపోయాయి. గుండెలో ఏదో సందడి. చేతులెత్తి దణ్ణం పెడుతూ ఒక మాటయినా గుర్తుకురానివాడిలా నిశ్చేష్టుడై నిల్చున్నాను. ఏనుగుల గుంపు తొండాలను పైకెత్తి కలిసికట్టుగా మళ్ళీ మళ్ళీ ఘీంకరించాయి. అవును, దేవదుందుభులు మ్రోగాయి! గగనభేరీ మోగింది! నల్లటి మేఘాలు కమ్ముకున...

గగ్గోలు

  సెప్టెంబర్ 18, 2025 గగ్గోలు  ( gaggōlu )     అర్థము    (విశేష్యము)  : కలత; అల్లరి; పెద్ద గొడవ; కలవరం    Meaning    (noun) : confusion; uproar; wailing      వాడుక / Usage       అవి జీవనయానంలో సహజమైన సంఘటనలేనని వాటికి తెలుసు. మనిషే గోల చేసేస్తాడు. మందు ఎక్కడ, మాత్ర ఎక్కడ అని గగ్గోలు పెట్టేస్తాడు.     They (animals) know that these are normal in life. But man complains and creates a ruckus for medicines and cures.    మెదడుకు మేత / Food for thought      “యూ షుడ్ రీడ్ గాంధీ! ఈ జెనరేషన్ ఆలోచనలను ప్రభావితం చెయ్యగలిగే శక్తి గల ఒకే ఒక థింకర్ ఆయన! ప్రతి విషయం మీదా ఒరిజినల్‌గా ఏదో ఒకటి చెప్పి వెళ్ళారు. నా ఫేవరెట్ గాంధీ, అరవిందో.     --  ఏనుగు డాక్టర్ - అవినేని భాస్కర్;   తమిళ మూలం  'యానై డాక్టర్' -  జయమోహన్

గొంతుకు

  సెప్టెంబర్ 17, 2025 గొంతుకు  ( gonthuku )     అర్థము    (విశేషణము)  : మోకాలి చిప్పలు గొంతు దగ్గరకు వచ్చేటట్లు కూచోవడం    Meaning    (adj) : sitting on haunches      వాడుక / Usage       డాక్టర్ కె. గొంతుక్కూ ర్చుని శ్రద్ధగా ఏదో ద్రవాన్ని పిపెట్‌లోకి తీసుకుంటూ ఉన్నారు .     Dr.K was sitting on his haunches and carefully pouring ingesting some liquid into the pipette.    మెదడుకు మేత / Food for thought      అన్ని జంతువులకంటేనూ ఏనుగులకు చాలా ప్రమాదకరం ఈ సీసాపెంకులు. ఏనుగు పాదాలు ఇసుక బస్తాల్లా మెత్తగా ఉంటాయి. విసిరిన ఖాళీసీసాలు ఏ చెట్టుకో తగిలి పగిలి చెట్లకింద గాజు పెంకులుగా పడివుంటాయి. ఏనుగులు తమ బ్రహ్మాండమైన బరువుతో వాటి మీద పాదం మోపగానే గాజు పెంకు క్షణంలో పాదం లోపల గుచ్చుకుంటుంది. రెండు అడుగులు వెయ్యగానే ఆ పెంకు పూర్తిగా పాదం లోపలకి వెళ్ళిపోతుంది. ఆ పైన ఏనుగుకు నడవడం అసాధ్యం. రెండే రోజుల్లో ఆ గాయం చీము పట్టేస్తుంది. పురుగులు పట్టేస్తాయి. పురుగులు మాంసాన్ని తొలుచుక...

నిరాడంబరము

  సెప్టెంబర్ 16, 2025 నిరాడంబరము  ( niraaḍambaramu )     అర్థము    (విశేష్యము)  : ఆడంబరం (హడావిడి, గర్వం, పటారం, జోరు) లేకపోవడం;     Meaning    (noun) : not showing off; no vain display or pomp; simplicity      వాడుక / Usage       ఆయన నిరాడంబరత , అంకితభావాల గురించిన వింటున్నకొద్దీ ఆయన మీద గౌరవం పెరిగిపోసాగింది .     The more I heard of his simplicity and dedication, my respect for him abounded.    మెదడుకు మేత / Food for thought      నిజానికి మనిషే అన్నిటికన్నా బలహీనమైన జంతువు. రోగాన్ని, నొప్పిని భరించడంలో జంతువులు చూపించే ఓర్పుని, గాంభీర్యాన్ని చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. ప్రాణం పోయేంత నొప్పి ఉన్నా ఏనుగు ఏడవదు. తపించదు. కళ్ళు మాత్రం సగం మూసుకుని ఉంటుంది. శరీరంలో అక్కడక్కడా సన్నటి వణుకు కనిపిస్తుంది, అంతే! నిజానికి ఏనుగుకు మత్తుమందు ఇవ్వకుండానే సర్జరీ చెయ్యొచ్చు. అంత నెమ్మదిగా సహకరిస్తుంది. కానీ అలా చెయ్యము. వాట్ ఎ బీయింగ్! దేవుడు ఏనుగులను తను మంచి క్రియే...

గుండ్రించు

  సెప్టెంబర్ 15, 2025 గుండ్రించు  ( gunḍrinchu )     అర్థము    (క్రియ)  : కడుపులో తిప్పటం    Meaning    (verb) : stomach churn when feeling sick; nausea      వాడుక / Usage       నేను తల పైకెత్తాలని ప్రయత్నించినప్పుడు మళ్ళీ గుండ్రించు కుని వచ్చింది.     I tried to look up but the nausea hit me hard.    మెదడుకు మేత / Food for thought      పక్కనే ఉన్న దాన్ని పట్టించుకోకుండా దేనికోసమో తపించిపోతూ దిగంతానికేసి చూస్తూ ఒక అల్పుడు నిల్చుని ఉన్నాడు. వాడే నేను. జీవితాంతం అన్వేషించేవాడిగా – అధికారాన్ని, సుఖాన్ని, గుర్తింపుని! గుర్తింపుకోసమై చదరంగాలు, ఎత్తుగడలు, జట్టులు కట్టడాలు, కృత్రిమమైన నవ్వులు, అర్థంలేని వేలాది మాటలు. ‘Man, vain insect!’ అనే బైరన్ గర్జనని ఆరోజు ఆ అడవిలో, ఎగసే జ్వాలలా ఎరుపెక్కిన డాక్టర్ కె. గొంతుగా విన్నాను. పిడుగులు రాల్చే వేగంతో ఆకాశమే చూపుడువేలు చాచి మనిషికి చెప్పింది: ‘నీ ప్రేమ స్వార్థం. నీ స్నేహం మోసం. నీ నవ్వు అబద్ధం. నీ మాటలు గాలిలో మేడలు.’   ...

రుగ్మత

  సెప్టెంబర్ 12, 2025 రుగ్మత  ( rugmata )     అర్థము    (విశేష్యము)  : రోగము; నొప్పి    Meaning    (noun) : illness; disease; pain      వాడుక / Usage      వంద కోట్ల మందిలో మానసిక రుగ్మతలు .     A billion people affected by mental illnesses.    మెదడుకు మేత / Food for thought      ఆకాశవీణపై ఉదయరాగం      హృదయాకాశ వీణపై ప్రణయ రాగం      కనగలిగే కనులుంటే      వినగలిగే మనసుంటే ॥      ఉదయానికి హృదయానికి రాగం ప్రాణం      అది లేకుంటే జగతికేది జీవాధారం ॥      తరులు గిరులు ఝరులు      కసుమ వల్లరులు ఏవీ      కలల వెన్నెలలు మన      వలపుల వాకిళ్ళు ఏవీ ॥      ప్రకృతి పురుషులోకటైతే      రాగం భావం      రాగానికి భావానికి     రంగభూమి మధుమాసం ॥      -- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (194...

వాచాలము

  సెప్టెంబర్ 11, 2025 వాచాలము  ( vaachalamu )     అర్థము    (విశేషణము)  : డంబాలు పలకడం; గొప్పలు చెప్పడం    Meaning    (adj) : pretentious; boastful      వాడుక / Usage      మన నాయకులకు వాచాలం ఎక్కువ, చేసే పని తక్కువ .     Our leaders are all talk and no action.    మెదడుకు మేత / Food for thought      అనురాగపు వెన్నెలలు కురిపించే జాబిల్లి      చెలిమిలోని నెత్తావులు వెదజల్లే సిరిమల్లి      మనసులోన తలపులోన నిలిచిన నా నెచ్చెలి      ఆకురాలు వేల నీవు ఆమనివై వచ్చేవు      చీకటి కన్నుల వాకిట దీపము వెలిగించేవు      మూగవడిన హృదయవీణ తీగలు సవరించి      మధురగీతికలు ఎంతో హాయిగ వినిపించేవు      నీ చల్లని చేయి తాకి పల్లవించె నా హృదయం      నీ తీయని పలుకులలో కురిసెనులే అమృతం      నెచ్చెలీ నీవు లేక లోకమంతా శూన్యము      వాడనీకు ఏ వేళల చెల...

నల్లికుట్లతనం

  సెప్టెంబర్ 10, 2025 నల్లికుట్లతనం  ( nallikutlatanam )     అర్థము    (విశేష్యము)  : బయటపడకుండా ఉండడం; నంగనాచి; తెలియనట్లు నటించడం    Meaning    (noun) : pretending simplicity or innocence      వాడుక / Usage      తాను వెన్నుపోటు, నల్లికుట్ల రాజకీయం చేయనని ఆమె అన్నారు .     She said that she doesn't indulge in backstabbing and deceptive politics.    మెదడుకు మేత / Food for thought      అంతులేని ఆశలున్న అంతరంగమా      ఊహాలలో తేలుతున్న ఓ విహంగమా      స్వార్ధానికి నీలోపాల స్ధానము కల్పించకూ      స్వంత లాభముకయి పరుల సౌఖ్యము కబళించకూ    ఆనందం ఎదురైన ఆవేదన కెరటానా      చిరునవ్వే చిందనీ చిరుత మనసు పెరగని    నీ హృది అనురాగపు గది నిజమిదియే తెలుసుకో    నిర్మలమగు మమత తోడ      నిరంతరం మసలుకో     -- వడ్డేపల్లి కృష్ణ (1948 - 2024)

ఎడ్డి

  సెప్టెంబర్ 09, 2025 ఎడ్డి  ( yeddi )     అర్థము    (విశేషణము)  : మోటు; మురికి; అప్రస్తుతం; మూఢుడు    Meaning    (adj) : uncouth; foolish; obstinate; out of turn      వాడుక / Usage       ఇప్పటి ఎడ్డి మందకు ఏం తెలుసు ఆయన విలువ .     The current crop of foolish leaders don't know his eminence.    మెదడుకు మేత / Food for thought      అలికిడైతే చాలు - ఆశతో నా కనులు      వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని       కమ్మతావులతోడ - నెమ్మదిగననుచేర      నీలిముంగురులలో - గాలి ఊయలలూగ      కనులు మూసి నేను కలత నిదురపోవ      జాజిపూవుల మాల - జాడ చిక్కెడి కాడ      రోజాలు కోయగా తోటలోనికి రాగ      కొంటె ముల్లొకటి నా - కొంగు చివరను లాగ      అలికిడైతే చాలు - ఆశతో నా కనులు      వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని      -- దేవులపల్లి కృష...

లంగ

  సెప్టెంబర్ 08, 2025 లంగ  ( langa )     అర్థము    (విశేషము)  : దుష్టుడు; నీచుడు; మోసగాడు    Meaning    (noun) : a crooked person      వాడుక / Usage       చట్టసభలకు లంగ లు, దొంగలు, భూకబ్జాదారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు ఎన్నికవుతున్నారు.     Crooks, thieves, encroachers, contractors and industrialists are being elected as law makers .    మెదడుకు మేత / Food for thought      అందాల ఆమని - ఆనంద దాయనీ      అరుదెంచినావటే - అప్సరా గామినీ ||అందాల||     గండుకోయిల నీదు - గళమందు పాడినది ||గండు||     నిండు పండువ ఏదొ - గుండెలో దాగినిది ||నిండు|| ||అందాల||     పువ్వులే నవ్వులుగా - పులకించి పోదువా ||పువ్వులే||     నవ్వులే వెన్నెలగా - నన్ను మురిపింతువా     పువ్వులే నవ్వులుగా - పులకించి పోదువా     నవ్వులే వెన్నెలగా - నన్ను మురిపింతువా ||అందాల||     ...

కక్ష్య

  సెప్టెంబర్ 05, 2025 కక్ష్య  ( kakshya )     అర్థము    (విశేషము)  : మొల నూలు; భూమధ్య రేఖ;  పరిభ్రమణ మార్గము; వసారా    Meaning    (noun) : an enclosure; girdle; equator; orbit      వాడుక / Usage      ఇస్రో  : జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌16 ప్రయోగం విజయవంతం.. నిర్దేశిత కక్ష్య లోకి ‘నైసార్‌’.     ISRO : GSLV - F16 launch successful.. NISAR enters orbit.    మెదడుకు మేత / Food for thought      సాగర మధనం మొదలవగానే విషమే వచ్చింది      విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది      అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది     కష్టాల వారధి దాటిని వారికి సొంతమవుతుంది     -- చంద్రబోస్

కేంద్రక విచ్ఛిత్తి

  సెప్టెంబర్ 04, 2025 కేంద్రక విచ్ఛిత్తి  ( kendraka vicchitthi )     అర్థము    (విశేషము)  : ఒక భారీ పరమాణు కేంద్రకం రెండు లేదా అంతకంటే ఎక్కువ చిన్న కేంద్రకాలుగా విడిపోడం    Meaning    (noun) : nuclear fission      వాడుక / Usage       చంద్రుడిపై  కేంద్రక విచ్ఛిత్తి ఆధారంగా అణు విద్యుత్ ఉత్పాదనకు అమెరికా , చైనా, రష్యా పోటీపడుతున్నాయి.     America, Russia, China are competing to produce fission based atomic energy on Moon.    మెదడుకు మేత / Food for thought      తెలుగు భాష తియ్యదనం /తెలుగు జాతి గొప్పతనం      తెలుసుకున్న వాళ్ళకి /తెలుగే ఒక మూలధనం      తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా      తెలుగు మరచిపోతే /వాళ్ళని నువు మరిచినట్టురా      ఇది మరువబోకురా..      పరభాషా జ్ఞానాన్ని సంపాదించు      కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు      కొమ్మల్లోన పక్షులన్నీ/ తమ కూతను...