Posts

Showing posts from July, 2021

కార్పణ్యము

  జులై 30, 2021 కార్పణ్యము  ( kārpaṇyamu )       అర్థము      (విశేష్యము): పగ; క్రోధము; లోభము; సానుభూతి     Meaning     (noun) : spite; malice; miserly; compassion        వాడుక / Usage         "ద్వేషం అసూయ కార్పణ్యం ముళ్లకిరీటమైంది."    Hatred, jealousy and malice became a crown of thorns.      మెదడుకు మేత / Food for thought " నవకళా సమితిలో నా వేషమును చూసి ఎచ్చటెచ్చటి జనుల్ మెచ్చవలదే నటరాజ నటరత్న నాటకావతంసుడన్ బిరుదులుగొని విర్రవీగగలదే ప్రతి పట్టణ గ్రామ పల్లెపల్లెలు గూడ ఈ భజగోవిందమేలవలదే ఊరూర గల కాఫీ హోటళ్లలో కిళ్ళీ కొట్లలో మనకప్పు పుట్టవలదే ఆంధ్ర నాటకరంగ మార్తాండుడనుచు సభలుగావించి ప్రేక్షకుల్ సత్కరింప పెట్టుబడికోసం అప్పులిప్పించి ఇచ్చి ఈ విశాలాంధ్ర నన్ను పోషింప వలదే....." -- ఘంటసాల పద్యం, రేలంగి వీరంగం, అప్పు చేసి పప్పు కూడు (1959)

కౌటిల్యము

  జులై 29, 2021 కౌటిల్యము  ( kauṭilyamu )       అర్థము      (విశేష్యము): కపటము; కుటిలము; వంకరతనము; టక్కు; మాయ; జిత్తు     Meaning     (noun) : crookedness; dishonest; fraudulent        వాడుక / Usage         అంతర్జాతీయ సంబంధాలలో మిత్ర దేశాలతో కూడా కొద్ది మేర కౌటిల్యము పరిపాటే.    In International relations even among friendly nations dishonesty is the norm.      మెదడుకు మేత / Food for thought " నా దేశం కరుణాంతరంగ నా దేశం సంస్కారగంగ  ఎక్కడికెళుతోంది దేశం ఏమై పోతోంది?  హిమశైల శిఖరం పైకా...పాతాళ కుహరంలోకా.. ప్రవచనాల పచ్చిక బయళ్లలో  పన్నాగాల గోతులు ప్రణాళికల గాదెల కింద  దాక్కున్న పందికొక్కులు  పావురాళ్ల ఈకలు తొడుక్కుని ఊరేగే రాబందులు ఉగ్గు పాలతో మతమౌఢ్యాలని రంగరించి కంచాలలో వర్ణభేదాలను వడ్డించి జాతికి నల్లమందు ఎక్కించే మతోన్మాదులు.." -- బంగారు మనిషి, డా.సి.నారాయణ రెడ్డి (జులై 29, 1931 - 2017)

కుహరము

  జులై 28, 2021 కుహరము  ( kuharamu )       అర్థము      (విశేష్యము): గుహ; బెజ్జము, రంధ్రము; చెవి     Meaning     (noun) : a cave; cavity; hole; ear        వాడుక / Usage         పరబ్రహ్మ  అంగుష్ఠ మాత్రుడై హృదయ కుహరంలో ఉంటాడని ఉపనిషత్తులు చాటుతున్నాయి.    Upanishads proclaim that the Brahman is within in the cave of the heart.      మెదడుకు మేత / Food for thought " బ్రహ్మసత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః ।   అనేన వేద్యం సచ్ఛాస్త్ర మితి వేదాంత డిండిమః ॥ " (Brahman is real. The world is a myth. The individual is verily Brahman and not different. That by which the Truth should be known is the Veda. Such is the proclamation of Vedanta.)  -- వేదాంత డిండిమ, శ్రీ ఆది శంకరాచార్య

కైంకర్యము

  జులై 27, 2021 కైంకర్యము  ( kain-karyamu )       అర్థము      (విశేష్యము): భగవంతునికి భక్తులు చేసే సేవ; ఊడిగము; కింకర; దొంగతనం; మోసం     Meaning     (noun) : service in a temple; serve; steal; deceive         వాడుక / Usage         శ్రీవారి కైంకర్యానికి వినియోగించే గంధపు చెట్లు వెయ్య ఎకరాల్లో నాటారు.    Sandalwood trees used in the service of Sri Venkateshwara are being grown in 1000 acres.      మెదడుకు మేత / Food for thought " కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగువుకి లేస్తారే, జనాలు తలలర్పిస్తారే సమూహక్షేమం పట్టని స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకు పోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే, తెలిసి భుజం కలిపి రారే అలాంటి జనాల తరఫున ఎవరో ఎందుకు పోరాడాలి? పోరి, ఏమిటి సాధించాలి? ఎవ్వరికోసం ఎవరు ఎవరితో సాగించే సమరం ఈ చిచ్చుల సిందూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాల భారతమా! ఓ అనాథ భారతమా! " -- సింధూరం, సీతారామ శాస్త్రి; అర్థ...

కీకారణ్యము

  జులై 26, 2021 కీకారణ్యము  ( kīk-āraṇyamu )       అర్థము      (విశేష్యము): దట్టమైన అడవి; కీ అన్నా కా అన్నా ఎవరికీ వినపడనంత అడవి      Meaning     (noun) : thick forest         వాడుక / Usage         తొమ్మిది వేల ఏళ్ళ చరిత్ర కలిగిన పెద్దాపురం దగ్గర ఉన్న తొలి తిరుపతి ఒకప్పుడు  కీకారణ్యము .    Tholi Tirupathi, near Peddapuram, was once a dense jungle and has a history of 9000 years.      మెదడుకు మేత / Food for thought " కవుల కలాలు, గాయకుల కమ్మని కంఠము లీ శ్మశానపుం  గవనులఁ ద్రొక్కి చూచెడి; నొకానొకనాఁ డల కాళిదాస భా  రవు ల శరీరముల్‌ ప్రకృతిరంగమునం దిపు డెంత లేసి రే  ణువు లయి మృత్తికం కలిసెనో కదా! కుమ్మరివాని సారెపై ఇట నస్పృశ్యత సంచరించుటకు దావేలేదు; విశ్వంభరా నటనంబున్‌ గబళించి గర్భమున విన్యస్తంబు గావించి, యు త్కటపుం బెబ్బులితోడ మేకఁ నొకప్రక్కన్‌జేర్చి జోకొట్టి యూ ఱట గల్పించు నభేదభావమును, ధర్మం బిందుఁగారాడెడిన్‌ " -- శ్మశానవాటి, నవయుగ కవ...

కింజల్కము

  జులై 23, 2021 కింజల్కము  ( kinjalkamu )       అర్థము      (విశేష్యము):  పుష్పములలోని పురుషభాగము, పుప్పొడితిత్తిగల కాడ; కేసరము     Meaning     (noun) : stamen         వాడుక / Usage         పరాగసంపర్కాన్ని కింజల్కము  నుండి  కీలాగ్రము  వరకు వెళ్ళే ప్రక్రియగా పిలుస్తారు.    Pollination is the process of transferring pollen from stamen to stigma.      మెదడుకు మేత / Food for thought " శిలయైన పతిం దెలచిన గాలులు మెల మెల్లగ తన తరగల నూగగ చలచల్లన ప్రాణమ్ములు తేరగ తలచిన కొలంది దుఃఖము పొంగగ హా యని కిన్నెర యేడుపు చూచి పులుగులూ కిన్నెర దుఃఖము చూచి మృగములూ కిన్నెర యేడుపు చూచి గాలులూ ఓదార్చగలే కవియు నేడ్చెనూ హా యని గోదావరి యీవార్త విన్నదీ గోదావరినది గుండె కరగినది గోదావరినది జాలి పొందినది గోదావరి కన్నీరు కార్చినది హా యని గోదావరినది పొంగి వచ్చినది గోదావరి తా నభయ మిచ్చినది గోదావరి కెరటాలు చాచినది గోదావరి రమ్మన్నది కిన్నెర హా యాని " -- కిన్నెరసాని పాటలు...

కాండము

  జులై 22, 2021 కాండము  ( kānḍamu )       అర్థము      (విశేష్యము): చెట్టుబోదె, ఈనె, కాడ; నీళ్లు; బాణము; కావ్య/పుస్తక పరిచ్ఛేదము     Meaning     (noun) : tree trunk, stem, stalk; water; arrow; division/chapter in a book         వాడుక / Usage         వినాయక చవితిలో పత్రిగా వాడే  ఉత్తరేణి కాండం , ఆకులు అనేక వ్యాధులు నివారిస్తాయి.    Used in Ganesh festival, Prickly chaff flower, stalk and leaves have many therapeutic uses.      మెదడుకు మేత / Food for thought " ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో.. భూగోళం పుట్టుక కోసం రాలిన సుర గోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజుని గెలిపించుటలో ఒరిగిన నర కంఠములెన్నో కుల మతాల సుడిగుండాలకు బలియైన పవిత్రులెందరో.. మానవ కళ్యాణం కోసం పణమెత్తిన రక్తము ఎంతో రణరక్కసి కరాళ నృత్యం రాచిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో భూస్వాముల  దౌర్జన్...

శైవలము

  జులై 21, 2021 శైవలము  ( ṣaivalamu )       అర్థము      (విశేష్యము): నీటి పాచి; నాచు; ప్రాకుడు; పద్మకాష్ఠము అనే వృక్షము లేక దాని సుగంధ చెక్క     Meaning     (noun) : algae; moss; Wild Himalayan Cherry tree        వాడుక / Usage        శైవలాలలో లభించే ప్రోటీన్లతో చూపులేని వ్యక్తికి వైద్యులు దృష్టి ప్రసాదించారు.    Doctors used the proteins in algae to restore sight to a blind man.      మెదడుకు మేత / Food for thought " హాస్యానికి రేలంగనే మారుపేరు ఉందని  హాస్యానికీ తెలీదు, రేలంగికీ తెలీదు  తెలిసినవాడొక్కడే తెలుగువాడు!” “సూర్యకాంతం తెరమీద విరిస్తే చాలు చుక్కలు దిక్కులు చూసేవి సూర్యుడు బిక్కమొహం వేసేవాడు. ఏ పాత్రనైన ఎడం చేత్తో చేసి అవతలకి గిరవాటేసేది" -- నక్షత్ర దర్శనమ్, తనికెళ్ళ భరణి ( రచయిత, నటుడు. తెలుగు భాషాభిమాని)

పుప్పొడి

  జులై 20, 2021 పుప్పొడి  ( puppoḍi )       అర్థము      (విశేష్యము): పుష్పములోని ధూళి; పరాగము; కౌసుమము; సుమనోరజము     Meaning     (noun) : pollen of a flower        వాడుక / Usage     ఏడాకులపాల చెట్ల పుప్పొడి ఆరోగ్య సమస్యలకు కారణం అని స్థానికులు చెపుతున్నారు.  Locals complain that the pollen from the Blackboard trees causes health issues.      మెదడుకు మేత / Food for thought " మంజూషలోనె యమర్చి కోణంబందు నొక్కి త్రాటం గొప్పు నెక్కు వెట్టె గాబోలు మంజూషికా వినిర్గమనంబు వేళకే జ్యావల్లి బిగిసియుండె దాళప్రమాణమౌ ధనువు జానకిదృష్టి కడ్డమ్ముగా వచ్చునంచు నెంచె గాబోలు నడ్డంబుగా ధనుస్సును బూని పిడిబాకువలె ద్రాడు వ్రీలలాగె నతని దృష్టికి జానకి యాగలేదు అతని కృష్టికి శివధనుస్సాగ లేదు సీత పూజడవెన్నుగా శిరసు వంచె జెరుకుగడవోలె నడిమికి విరిగె ధనువు " ( పెట్టెలో ఉండగానే, అల్లెత్రాటిని కొప్పుకి కట్టాడేమో అన్నట్టుగా, ఆ విల్లుని పెట్టెలోంచి తీసేప్పటికే  ఆ త్రాడు బిగిసి ఉంది. తాడిచెట్టంత పొడుగున్...

గుల్మము

  జులై 19, 2021 గుల్మము  ( gulmamu )       అర్థము      (విశేష్యము): పొద; గుబురు; బోదె లేని చెట్టు; ప్లీహము యొక్క వ్యాధి; తొమ్మిది ఏనుగులు, తొమ్మిది రథాలు, ఇరవైయేడు గుర్రాలు, నలభైయైదు పదాతులు గల సేనా దళం     Meaning     (noun) : shrub; bush; enlargement of spleen; military unit with 9 elephants, 9 chariots, 27 horses, 45 foot soldiers        వాడుక / Usage     గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా వాడతారు.  ఆకుకూరలు  చాలా వరకు గుల్మాలే .  Shrubby plants are extensively used in cooking and even as medicines. Leafy vegetables are predominantly shrubs.      మెదడుకు మేత / Food for thought " ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి వేసెయ్ చాప జోర్సెయ్ నావ బారుసెయ్ వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా" -- వేటూరి పదం, బాలు గళం - గోదావరి అమరం

మూలము

  జులై 16, 2021 మూలము  ( mūlamu )       అర్థము      (విశేష్యము): వేరు; మొదలు; ప్రధానమైన;  ఒక సంఖ్యని అదే సంఖ్యచే కొన్ని తడవలు గుణించగా వచ్చే సంఖ్యకి మొదటి సంఖ్యని మూలము     Meaning     (noun) : root; cause; origin; root of a number        వాడుక / Usage     రెండు యొక్క వర్గ మూలం కరిణీయం అని దాని విలువని సులభ సూత్రాల్లో నిర్ధారించారు.  Sulabha sutras calculated the square root of 2 as irrational.      మెదడుకు మేత / Food for thought "సమస్య ద్వికరణి ప్రమాణం తృతీయేన వర్ధయేత్  తచతుర్ధే నాత్మ చతుస్త్రీమ్షోనేన సవిశేషః" (increase the measure by its third and this third by its own fourth less the 34th part of that fourth. this is the value with a special excess) sqrt 2 = 1 + 1/3 + 1/(3*4) - 1/(3*4*34) -- బౌధాయన సులభ సూత్ర (~ 800 BC)

శ్రేణి

  జులై 15, 2021 శ్రేణి  ( ṣrēṇi )       అర్థము      (విశేష్యము): వరుస; క్రమము; సమూహము; ఒక పద్ధతిలో ఉన్న అంకెల వరుస; బొక్కెన     Meaning     (noun) : a row/range; series; progression; group/guild; bucket        వాడుక / Usage     లీబ్నిజ్ కన్నా మూడు శతాబ్దాల పూర్వం కేరళకు చెందిన మాధవుడు త్రికోణమితి అనంత శ్రేణిలు కనుగొన్నాడు.  Three centuries before Leibnitz Kerala's Madhava discovered the trigonometric infinite series.      మెదడుకు మేత / Food for thought "రతికేళిలో హారము తెగిపోగా ముత్యాలు అయ్యాయి చెల్లాచెదురు. వాటిలో ఆరో వంతు నేల మీద దొర్లాయి, అయిదో వంతు పడక మంచంలో పొర్లాయి. జాణ చేతిలో మూడో భాగం, ప్రియుడి చేతిలో పదో వంతు. హారంలో ఆరు ముత్యాలు మిగిలితే, మొత్తం ముత్యాలు ఎన్నో చెప్పుకోగలరా?  " -- లీలావతీ గణితంలో సమస్య, భాస్కరాచార్య  (1114 - 1185)

కర్ణము

   జులై 14, 2021 కర్ణము  ( karṇamu )       అర్థము      (విశేష్యము): చెవి; రంధ్రము; చుక్కాని;  లంబకోణత్రిభుజములో లంబకోణానికి ఎదుటి భుజము     Meaning     (noun) : ear; hole; rudder of a ship; hypotenuse        వాడుక / Usage     ఒక లంబకోణ  త్రిభుజంలో   కర్ణం  మీద చతురస్రపు  వైశాల్యం  మిగిలిన రెండు భుజాల మీద  చతురస్రాల వైశాల్యాల మొత్తానికి సమానం.  The square on the hypotenuse of a right angled triangle is equal to the sum of squares on the other two sides.      మెదడుకు మేత / Food for thought "నాకు తిరిగి మళ్ళా విద్యాభ్యాసం మొదలు పెట్టే అవకాశం దొరికితే, ప్లేటో సలహా మేరకు గణితంతో మొదలు పెడతాను.  " -- ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, గెలీలియో గలిలీ  (ఫిబ్రవరి 15, 1564 - 1642)

శంకువు

  జులై 13, 2021 శంకువు  ( ṣankuvu )       అర్థము      (విశేష్యము): మోడు, గుంజ, స్థంభం; లంబము (త్రికోణమితి); ఒక భుజము చుట్టూ త్రిభుజం తిప్పితే వచ్చే ఘనాకారం     Meaning     (noun) : stump, pole, pillar; sine, altitude (trigonometry); cone        వాడుక / Usage     విజయనగర సామ్రాజ్యానికి   క్రీ. శ. 1336 లో   విద్యారణ్యస్వామి శంకుస్థాపన చేసారు.  Vidyaranyaswami laid the foundations for Vijayanagara Empire in 1336 AD.      మెదడుకు మేత / Food for thought " నీ అభిప్రాయాలు వెర్రిగా ఉన్నాయని వాటిని వ్యక్తపరచడానికి భయపడకు. ఎందుకంటే ఈ రోజు అందరిచే ఆమోదించబడ్డ విషయాలన్నీ ఒకప్పుడు వెఱ్ఱివిగానే పరిగణించబడ్డాయి." -- బ్రిటీష్  తత్వవేత్త బెర్ట్రాండ్ రస్సెల్ (మే 18, 1872 - 1970)

చాపము

  జులై 12, 2021 చాపము  ( chāpamu )       అర్థము      (విశేష్యము): ధనుస్సు, విల్లు; ఒక వృత్తము యొక్క పరిధి లోని భాగము      Meaning     (noun) : A bow; arc of a circle        వాడుక / Usage     పందొమ్మిదవ  శతాబ్దంలో భారతీయ రేఖాంశం వెంబడి మహా చాపాన్ని లాంబ్టన్, ఎవరెస్ట్   కొలిచారు.   Everest & Lambton mapped the longitudinal arc of India in early nineteenth century.      మెదడుకు మేత / Food for thought "విద్యాభ్యాసం అంటే బడికి వెళ్లి పట్టభద్రులవ్వడమే కాదు. దాని లక్ష్యం జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, జీవితం యొక్క పరమార్థాన్ని అవగతం చేసుకోవడం. " -- శకుంతలా దేవి  (నవంబర్ 04, 1929 - 2013)

మిటమిట

  జులై 09, 2021 మిటమిట  ( miṭa-miṭa )       అర్థము      (విశేషణము): మండడానికి ధ్వన్యనుకరణం; మిక్కిలి వేడిగా, ప్రకాశముగా; కోపంతో చూడటం     Meaning     (adverb) : blazing hot, bright; seeing angrily        వాడుక / Usage     కెనడాలో  మిటమిటలాడే ఎండకి అలవాటులేని జనం మలమల మాడిపోయారు.   Unused to the fierce heat Canada withered.      మెదడుకు మేత / Food for thought " పుట్టబోయెడి బుల్లిబుజ్జాయి కోసమై పొదుగుగిన్నెకు పాలు పోసి పోసి కలికి వెన్నెల లూరు చలువ దోసిళ్ళతో లతలకు మాఱాకు లతికి యతికి పూలకంచాలలో రోలంబములకు ఱే పటి భోజనము సిద్దపఱచి తెలవాఱకుండ మొగ్గలలోన జొరబడి వింత వింతల రంగు వేసి వేసి తీరికే లేని విశ్వ సంసారమందు అలసిపోయితి వేము దేవాదిదేవ ! ఒక నిమేషమ్ము కన్ను మూయుదువుగాని రమ్ము! తెఱచితి మా కుటీరమ్ము తలుపు !   " -- ఉదయశ్రీ, జంధ్యాల పాపయ్య శాస్త్రి  (ఆగష్టు 04, 1912 - 1992)

నిగారము

  జులై 08, 2021 నిగారము  ( nigaaramu )       అర్థము      (విశేష్యము): శ్రేష్ఠము; తళుకు, బెళుకు; నిగ్గు; నిగనిగ (మెరవటం) అనుకరణ పదం     Meaning     (noun) : excellent; glittering; shining; bling (manner imitation word)        వాడుక / Usage     పనస పండు తినడం వల్ల చర్మ నిగారింపు పెరుగుతుందని చెప్తారు.   Jack fruit is said to make the skin glow.      మెదడుకు మేత / Food for thought " నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది శూన్యమైన వేణువులో ఒక స్వరం కలిపి నిలిపింది ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా నది దోచుకుపోతున్న నావను ఆపండి రేవు బావురుమంటోందని నావకు చెప్పండి నావకు చెప్పండి ... " --  ముత్యాలముగ్గు ,  గుంటూరు శేషేంద్ర శర్మ  (అక్టోబర్ 20, 1927 - 2007) ...