పైరగాలి
ఏప్రిల్ 01, 2025 పైరగాలి ( pairagali ) అర్థము (విశేష్యము) : వేసవికాలములో ఆగ్నేయ (దక్షిణ తూర్పు మధ్య) దిశనుండి, సముద్రము నుండి భూమి మీదికి వీచు, చల్లగాలి Meaning (noun ) : south easterly cooler winds in summer (good for crops) వాడుక / Usage ఇంతలో పైరగాలి పరిగెత్తుకొచ్చింది . పచ్చటి గాలి, కంకుల గాలి, కండెల గాలి, కాయల గాలి, పువ్వుల గాలి, పూతల గాలి నేల వాసన పూసుకుని ఊరంతా పరుచుకుంది. The south easterly winds blew quickly - air of the fields, of stalk, of corn, of vegetables, flowers and blossom - carrying the earthy smells it spread around the village. మెదడుకు మేత / Food for thought నోరుజారి అవతలివాళ్ళు ఒక మాటంటే దాన్ని పట్టుకొని వాదనలో గెలవడం, అవతలివారిని ఓడించి క్షమాపణ చెప్పించుకోవటం గొప్పవాళ్ళ లక్షణమైతే అయ్యుండవచ్చు. కానీ, అవతలివాళ్ళు మాటజారితే మనం దాన్ని గుర్తించలేదన్నట్టు ప్రవర్తించడం మహోన్నతుల లక్షణం...