కంఠభూమి

 

ఆగష్టు 11, 2022

కంఠభూమి (kaṇṭha-bhumi)

    అర్థము

   (విశేష్యము): దేహాన్ని శిరస్సుని కంఠము కలిపినట్లు రెండు దీవుల నడుమ వుండే భూమి; భూసంధి

   Meaning

   (noun) : isthmus 

   వాడుక / Usage

 సూయెజ్ కంఠభూమి గుండా 1869 లో సూయెజ్ కాలువ త్రవ్వబడింది.
 Suez canal was dug through the Isthmus of Suez in 1869.

   మెదడుకు మేత / Food for thought

ఇది మన భారతీయ  శిల్పకళా వైభవము

ఇది  మన ప్రాచీన నాగరికతా చిహ్నము
ఇది మానవతకే  స్వర్ణయుగము...
ఆనాటి మానవుడు   ఏమి చేశాడు
ఈనాటి మానవుడు  ఏమి చూశాడు
శిలలలో జీవకళ పోశాడు వాడు
జీవితాన్నే కళగ చేశాడు వీడు          
మంచినే ఎంచి మనసునే పెంచి
మనిషి దేవుడుగా మారజూశాడు
నాతి అందాలన్ని రాతిలో చెక్కి
తీరని కోరికలె తీర్చుకున్నాడేమో                        
మానవుల కన్నీరు  మాన్పగా నెంచి
మహరాజు  భిక్షువై బయలుదేరాడు
బుద్ధం శరణం గచ్చామి ...ధర్మం శరణం గచ్చామి
సంఘంశరణం గచ్చామి....
మనసునిచ్చిన  మగువ మమత  కన్నీరుగా
పారించి అడవులకు  పారిపోయాడు         
-- సుమంగళి, ఆత్రేయ (మే 07, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి