జలసంధి

 

ఆగష్టు 12, 2022

జలసంధి (jala-sandhi)

    అర్థము

   (విశేష్యము): రెండు జలభాగాలను కలుపుతూ రెండు భూభాగాలను వేరుచేసే ప్రాంతం; ఇరుకైన సముద్రమార్గం

   Meaning

   (noun) : strait 

   వాడుక / Usage

 జిబ్రాల్టర్ జలసంధి అట్లాంటిక్ మరియు మధ్యధరా సాగరాల మధ్యనున్న ప్రకృతి సిద్ధమైన మార్గము.
 Gibraltar strait is the natural link between Atlantic ocean and Mediterranean sea.

   మెదడుకు మేత / Food for thought

ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలుకరించుకోవా
ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు
గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు
ప్రశ్న లోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండెనడుగు

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు
అడగరే ఒక్కొక్క అల పేరు
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు
పలకరే మనిషి అంటే ఎవరూ
సరిగాచూస్తున్నదా నీ మది మదిలో నువ్వే కదా ఉన్నది
చుట్టూ అద్దాలలో విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నది
నీ ఊపిరిలో లేదా గాలి వెలుతురు నీ చుపుల్లో లేదా
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా
ప్రపంచం నీలో ఉన్నదని చెప్పేదాక ఆ నిజం తెలుసుకోవా
తెలిస్తే ప్రతీ చోట నిన్ను నువ్వే కలుసుకొని పలుకరించుకోవా

మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి దృశ్యాలై
నీడలు నిజాల సాక్షాలే
శతృవులు నీలోని లోపాలే స్నేహితులు నీకున్న ఇష్టాలే
ఋతువులు నీ భావ చిత్రాలే
ఎదురైన మందహాసం నీలోని చెలిమి కోసం
మోసం రోషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం
పుటక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ

జీవితకాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ        

-- గమ్యం,సిరివెన్నెల సీతారామ శాస్త్రి  (మే 20, 1955 - 2021)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి