సత్యాగ్రహము
ఆగష్టు 15, 2022
సత్యాగ్రహము (satyāgrahamu)
అర్థము
(విశేష్యము): సత్యము=నిజము, యథార్థము, సుగుణము; ఆగ్రహము=ఆసక్తి, వాంఛ, పట్టుదల; తాను చేయుచున్న పని ధర్మయుక్తమైనదను దృఢవిశ్వాసముతో ఎదుటివారిని సత్యాహింసామార్గముల ద్వారా శాంతియుతముగ ఎదిరించే (గాంధీజీ అనుసరించిన) మార్గం
Meaning
(noun) : holding firmly to truth; non-violent civil resistance
వాడుక / Usage
బాపూజీ ఆఫ్రికాలో మొదలుపెట్టిన సత్యాగ్రహం, మార్టిన్ లూథర్ కింగ్ మరియు నెల్సన్ మండేలా తదితురలను ప్రభావితం చేసింది.
Gandhiji's Satyagraha, started in Africa, influenced the likes of Martin Luther King, Nelson Mandela and many others.
మెదడుకు మేత / Food for thought
నేను మీకు హింసని బోధించలేను. దానికి కారణం నేను హింసను నమ్మనుగనుక. కానీ నువ్వు నమ్మిన సిద్ధాంతం విస్మరించకు, ప్రాణం పోయినా సరే, ఎవ్వరి ముందు తల మంచొద్దు. నా శరీరాన్ని హింస పెట్టచ్చు, నా ఎముకలు విరకొట్టచ్చు, నన్ను చంపేయచ్చు. అప్పుడు వారికి నా శవం వశమవుతుంది, కానీ నా విధేయత దొరకదు.
-- మహాత్మా గాంధీ (అక్టోబర్ 2, 1869 - 1948)
Comments
Post a Comment