సమ్మేళనము

 

ఆగష్టు 17, 2022

సమ్మేళనము (sammelaṇamu)

    అర్థము

   (విశేష్యము): సమితి; కలయిక; సంఘము; కూటమి; సమాహారం

   Meaning

   (noun) : Union; joining; meeting

   వాడుక / Usage

 ఒకటవ అధికరణ ప్రకారం "ఇండియా, అనగా భారత్, రాష్ట్రాల సమ్మేళనము"
 Article 1 declares "India, that is Bharat, shall be a Union of States."

   మెదడుకు మేత / Food for thought

చావడం తెలియనంత వరకు చంపడం తెలుసుకోవడం అనవసరం. భారత దేశం మృగప్రాయమైన శక్తి కన్నా అహింసాయుత మార్గం వల్లే అభివృద్ధి చెందుతుంది. మహాత్ముడు మొదలు పెట్టిన యుద్ధం రెండిటికి వ్యతిరేకంగా మొదలు అయ్యింది. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం, రెండు మన అంతర్గతం మీద. మొదటిది ఇప్పుడు గెలిచాము. కానీ రెండోది ఎప్పటికీ ముగియదు. అది నిరంతరం మన ఆత్మ శుద్ధి కోసమే....మన దేశంలో కొందరు యువకులు ఇక్కడ హిందూ రాజ్యం ఉండాలని, కేవలం హిందూ సంస్కృతే చెల్లాలని కోరుకుంటున్నారు. గాంధీజీ అలంటి ఉన్మాద ఆలోచనలను ఎదిరించారు. ఐక్యమత్యంలోనే మన దేశ సద్గతి ఉంది.


-- సర్దార్ వల్లభాయ్ పటేల్  (అక్టోబర్ 31, 1875 - 1950)

Comments