అమ్ములవాన

 

ఆగష్టు 29, 2022

అమ్ములవాన (ammulavaana)

    అర్థము

   (సమాసము): అమ్ము = బాణము, శరము; వాన = వర్షము; శరవర్షము;వాన పడినట్లు అమ్ములు సంధించడం

   Meaning

   (Compound) : flurry/rain of arrows

   వాడుక / Usage

 అభిమన్యుడు ప్రళయకాల రుద్రుడై కౌరవులపై అమ్ములవాన కురిపించాడు.
 Abhimanyu fought ferociously raining arrows on the Kouravas.

   మెదడుకు మేత / Food for thought

ఈ లోకపు అంధకారం ఎంత గొప్పదంటే ...సముద్రంలో ఎన్ని కాగడాలు వెలిగించి పారేసిన.. ఎట్టా ఆరిపోతాయో ... అట్టా ముంచేసేటివంటి అంధకారం ... ఈ లోకంలో పేరుకుంది. దానిని ఎవడు ఏమి చేయగలడు. ఎదో చేతైనది చేసెయ్యడం. ఇది మన పని కాదనుకోవడం, వదిలెయ్యడం. అదొక్కటే వివేకవంతుడుచేయగలిగినటువంటి పని....ఇక్కడకొచ్చిన తర్వాత నాకు ఏమి తెలిసిందంటే , జ్ఞానంతో నిబిడీకృతమైన మౌనం కావలి - గొప్ప గొప్ప ప్రవక్తలు మాట్లాడకుండా ఊరుకున్నపుడు వారి నుంచి వచ్చే మౌనం కావలి.

-- చలం (మే 18, 1894 - 1979)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి