అంపపాన్పు
ఆగష్టు 30, 2022
అంపపాన్పు (ampapānpu)
అర్థము
(సమాసము): అంప = బాణము, (అమ్ము యొక్క షష్ఠి విభక్తి రూపం); పానుపు = మంచం, పరుపు; బాణాలతో చేయబడిన మంచం
Meaning
(Compound) : bed of arrows
వాడుక / Usage
కురుక్షేత్ర యుద్ధానంతరం అంపపాన్పు మీద ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠిరునకు ఉపదేశించాడు.
Resting on his bed of arrows, after Kurukeshetra war, Bheeshma taught Vishnu Sahasranama to Yuddhistira.
మెదడుకు మేత / Food for thought
రామాయణంలో సుగ్రీవుడు సీతాదేవి ఉనికిని గూర్చి వెతుకవలసిన స్థలాలను పేర్కొనే సందర్భంలో వరుసగా దండకారణ్యం, గోదావరీ నది, తరువాత, ఆంధ్ర, పుండ్ర, చోళ, పాండ్య దేశాలున్నట్టు చెప్పాడు. ధర్మరాజు రాజసూయం చేసే ముందు దక్షిణ దిగ్విజయ యాత్రకు సహదేవుని పంపినట్లు అతడు పాండ్యులు, ద్రవిడులతో పాటు ఆంధ్రులను, కళింగులను, ఓఢ్రులను జయించినట్లు భారతంలో ఉంది. బౌద్ధ సారస్వతంలో చోళరఠ్ఠం, కళింగరఠ్ఠం, ద్రమిళరఠ్ఠం తో పాటు గోదావరినదికి ఇరు వైపుల అళక, ముళక దేశాలున్నట్లు, ఇవి రెండు అంధక రాష్ట్రాలని “సుత్తనిపాత” గ్రంథంలో ఉంది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దిలో మన దేశానికి వచ్చిన గ్రీక్ రాయబారి మెగస్తనీస్ మౌర్యుల తరువాత ఎన్నదగిన జాతి ఆంధ్ర జాతియని, వారి రాజు మిక్కిలి బలవంతుడని అతనికి 32కోటలున్నాయని పేర్కొన్నాడు.-- తెలుగు బాష వయసు ఎంత?, సురేష్ కొలిచాల
Comments
Post a Comment