పేరడివి

 

ఆగష్టు 31, 2022

పేరడివి (pēradivi)

    అర్థము

   (సమాసము): పేరు = ఘనీభవించిన, సాంద్రమైన, పెద్ద; అడవి = అరణ్యం; దట్టమైన అడవి

   Meaning

   (Compound) : dense forest

   వాడుక / Usage

 ద్వైత మరియు కామ్యక పేరడవుల్లో పాండవులు అష్టకష్టాలు అనుభవించినా ధర్మ మార్గం వీడలేదు.
 Pandavas suffered a lot in the dense jungles of Dvaitha & Kamyaka but never strayed from the path of Dharma.

   మెదడుకు మేత / Food for thought

వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పోయేనాడు వెంబడిరాదు పూచికపుల్లైనా
చేతిలో బెల్లం ఉన్నవరకే చీమ బలగమంట
చేతిలో బెల్లం చెల్లితే ఎవరు రారు వెంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
ప్రమిదలో నూనె ఉన్నవరకే దీపమెలుగునంట
ప్రమిదలో నూనె నిండగా దీపమారునంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా
పంచభూతముల తోలుబొమ్మతో ప్రపంచమాయెనంట
మట్టికుండ ఇది నమ్మరాదు మర్మమెరుగమంట
వస్తావట్టిది పోతావట్టిది ఆశలెందుకంటా

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి