ద్వీపపుంజము
ఆగష్టు 09, 2022
ద్వీపపుంజము (dvīpa-punjamu)
అర్థము
(విశేష్యము): ద్వీపం=నీటితో చుట్టబడిన ప్రదేశం; పుంజము=రాసి, ప్రోగు, గుంపు; సముద్ర మధ్యములో ఉన్న ద్వీప సమూహము
Meaning
(noun) : archipelago
వాడుక / Usage
అగ్నిపర్వతాల విస్ఫోటనం కారణంగా ద్వీపపుంజాలు అనేకం ఏర్పడ్డాయి.
Volcanic eruptions are the origin of many archipelagos.
మెదడుకు మేత / Food for thought
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
ఎదుట నా ఎదుట ఏవో సోయగాల మాలికలు
మదిలోన గదిలోన
మదిలోన గదిలోన మత్తిలిన కొత్త కోరికలు
నిలువనీవు నా తలపులు మరీ మరీ ప్రియా ప్రియా
నిలువనీవు నా తలపులు నీ కనుల ఆ పిలుపులు
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
జరిగి ఇటు ఒరిగి పరవశాన ఇటులే కరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
చిరునవ్వుల అరవిడిన చిగురాకు పెదవుల మరిగి
మరలి రాలేవు నా చూపులు మరీ మరీ ప్రియా ప్రియా
మరలి రాలేవు నా చూపులు మధువుకై మొదలు తుమ్మెదలు
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
మగువ సిగ్గు దొంతరలో మసలే వలపు తొలకరులో
సిగలో అవి విరులో అగరు పొగలో అత్తరులో
-- మేఘ సందేశం, దేవులపల్లి కృష్ణ శాస్త్రి (నవంబర్ 01, 1897 - 1980)
Comments
Post a Comment