శీకరం

 

మే 10, 2021

శీకరం (ṣī-karamu)

    అర్థము

   (విశేష్యము): తుంపర; చినుకు; ఏనుగు తొండం చివర పుట్టే మదం

   Meaning

   (noun) :  drizzle; spray; a drop of water; secretions of male elephants in musth

     వాడుక / Usage
   
   ఆమె విరహాగ్నిని ఆ శీకర పవనాలు కవ్వించాయి.
    The spraying mist teased her pangs of separation from her lover.

    మెదడుకు మేత / Food for thought

"
"ఓ తల్లీ! నేల తల్లీ! నువ్వెంత గొప్పదానివమ్మా? ఏడుపెరగనివాణ్ణి, ఈ బుడ్డాడి కోసం ఏడుస్తానేమోనని ఆణ్ణి ముందే తీసుకెళ్ళావా అమ్మా! లేకపోతే ఓరి బుడ్డాడా, నీ అయ్య పోతే నువ్వేడుస్తావేమోరా! బతుకంతా ఏడుపెరక్కుండా బతికిన ఏసోబుగాడు పోయాక ఎనక ఎవరూ ఏడవకూడదని ఆణ్ణిప్పుడే లాక్కెళ్ళావా తల్లీ! కానమ్మ! నాకేం దిగులు లేదు. కాన్తల్లీ! నే పోయాక మట్టి చేసేందుకు మడిసి లేకుండా పోయాడు. కొంచం ఆ సమయ మొచ్చినప్పుడు ..కొంచం ముందు చెప్తివా...నేనే గొయ్యి తీసుకు అందులో పడుంటాను. ఆ పైన నువ్వే మట్టి కప్పుకో తల్లీ"

-- ఏడుపెరగనివాడు, అమరావతి కథలు... సత్యం శంకరమంచి (మార్చ్ 3, 1937 - 1987)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి