పథము
నవంబర్ 22, 2024
పథము (pathamu)
అర్థము
(విశేష్యము) : మార్గము; త్రోవ; దారి
Meaning
(noun) : a path/road/way
వాడుక / Usage
స్వాగతించెను ప్రేమ పథం సాగినది ఇరువురి బ్రతుకు రథం.
As the path of love welcomes our chariot of life glides on.
మెదడుకు మేత / Food for thought
సారపు ధర్మమున్ విమలసత్యముఁ బాపముచేత బొంకుచేఁ
బారముఁ బొందలేక చెడఁబాఱినదైన యవస్థదక్షు లెవ్వార లుపేక్షచేసి రది వారలచేటగుఁ గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్
(ధర్మం అధర్మం చేత, సత్యం అసత్యం చేత ఫలితాన్ని పొందలేని దుస్థితి కలిగినప్పుడు సమర్థులు ఉపేక్షించ కూడదు. అలా చేస్తే వారికే చేటు కలుగుతుంది, అంతేగాని ధర్మాన్ని రక్షించే, సత్యాన్ని స్థాపించి, మంచిని చేయుటకు దైవం ఉన్నది.)
-- మహాభారత ఉద్యోగపర్వం, తిక్కన (1205 - 1288)
Comments
Post a Comment