టిప్పణము
మే 13, 2021
టిప్పణము (ṭippaṇamu)
అర్థము
(విశేష్యము): టీక; తాత్పర్యం; టీకకి టీక; టీక అనగా అర్థ వివరణ
Meaning
(noun) : glossary; commentary on a commentary; explanatory notes or annotation
వాడుక / Usage
ఆరుద్ర రచన 'తెలంగాణ' కి శ్రీశ్రీ టిప్పణము వ్రాస్తూ 'త్వమేహం' అని పేరు సూచించారు.
Sri Sri suggested the name 'Tvameham' while writing commentary on Arudra's book 'Telangana'. మెదడుకు మేత / Food for thought
"
"వెతికే మజిలీ దొరికే దాకా
కష్టాలు నష్టాలు ఎన్నొచ్చినా
క్షణమైన నిన్నాపునా
కట్టాలి నీలోని అన్వేషణా
కన్నీటి పై వంతెనా
బెదురంటు లేని మది ఎదురు తిరిగి అడిగేన
బదులంటు లేని ప్రశ్న లేదు లోకాన
నీ శొకమే శ్లోకమై పలికించరా మనిషీ
తికమక మకతిక పరుగులు ఎటుకేసీ
నడవరా నరవరా నలుగురితో కలిసీ"
-- సిరివెన్నెల సీతారామ శాస్త్రి
Comments
Post a Comment