కరతలామలకం

 

మే 17, 2021

కరతలామలకం (karatalamalakam)

    అర్థము

   (జాతీయం):  కరము - హస్తము/చెయ్య; తల - ముందు భాగం; అమలకం - ఉసిరికాయ; చేతిలో ఉసిరికాయ స్పష్టంగా తెలిసినట్లు ఏదైనా విషయం సులభంగా స్పష్టంగా తెలియడం

   Meaning

   (idiom) : as clear as a fruit in hand; knowing like the back of your hand; easy

     వాడుక / Usage
   
  కోనేరు హంపికి చిన్నతనంలోనే చదరంగం కరతలామలకం అయ్యింది.
   Koneru Hampi knew chess like the back of her hand from childhood. 

    మెదడుకు మేత / Food for thought

"
"నీకంఠార్పిత కాలపాశము శిరోనిర్ఘాంత పాతంబు లం
కోకస్సంచయ కాళరాత్రి గళ బద్ధోదగ్ర కాలాహి క
న్యాకారాగత మృత్యువున్ జనక కన్యన్ వేగ యొప్పించి లో
కైక త్రాణుని రామునిం గనుము నీకీ బుద్ధి గాకుండినన్
"

(నీ కంఠానికి బిగుసుకున్న యమపాశం ఆమె. నీ తల మీద పడబోతున్న పిడుగు. నీ లంకా నగరం పాలిట కాళ రాత్రి. నీ కుతికెకు చుట్టుకును వున్న భయంకర కాల సర్పం. నీ ముంగిట్లోకి స్త్రీ ఆకారంతో ప్రవేశించిన మృత్యు దేవత. ఆమెను వెంటనే శ్రీరామునకు అప్పగించి నిన్ను నీవు కాపాడుకో. నీ దుష్టబుద్ధిని మానుకో)

-- హనుమంతుడు, భాస్కర రామాయణంలో - మల్లిఖార్జున భట్టు (13వ శతాబ్ధం)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి