భగీరథ ప్రయత్నం

  

మే 20, 2021

భగీరథ ప్రయత్నం (bhagiratha prayatnam)

    అర్థము

   (జాతీయం): కష్టమైన పనిని సాధించటానికి విసుగు, విరామం లేకుండా ప్రయత్నించడం; భగీరథుడు గంగని భూమికి తెచ్చినట్లు

   Meaning

   (idiom) : tireless effort; indefatigable

     వాడుక / Usage
   
 మిత్రుడి కోసం భగీరథ ప్రయత్నం - ఝార్ఖండ్ నుంచి నొయిడాకి ఆక్సిజన్ తెచ్చిన దేవేంద్ర.
  Untiring effort for friend - Devendra gets oxygen from Jharkhand to Noida. 

    మెదడుకు మేత / Food for thought

"
"రసవాహినీ స్వాగతం, జీవ రసధునీ స్వాగతం...
సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు
దివివారిని భువిసీమకు తరలించగ తలచినట్టి భగీరథుని నిరీక్షణకు
దీర్ఘ తపస్సమీక్షణకు విరూపాక్ష కరుణా సంప్రోక్షణ మీ రసవాహిని....
పినాకపాణి వేణి భరమే  కరమై గ్రహించే సురగంగను తన నాయికగా
ఉరుకుల పరుగుల ఉరుముతో వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా
ఆ సురగంగా ప్రళయహేల అది విషకంధరునకు ప్రణయాలీలగా
విలయము తన విలాసలీలగా.... ఔదల దాల్చెను శంకరుడు ఆభరణముగా "

-- గంగావతరణం, సిరివెన్నెల సీతారామశాస్త్రి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి