విభావరి
మే 24, 2021
విభావరి (vibhavari)
అర్థము
(విశేష్యము): విభ - కాంతి, ఆవరి - కప్పడం; కాంతిని కప్పేది చీకటి, రేయి, రాత్రి; వేశ్య స్త్రీ; పసుపు;
Meaning
(noun) : that which covers the light; night; female prostitute; turmeric
వాడుక / Usage
ఘంటసాల సంగీత విభావరి అందరిని రసడోలికలలో ఊపింది.
Ghantasala music night was an ecstatic trip for everyone. మెదడుకు మేత / Food for thought
"
“ఏ పాపమూ ఆమెను తాకదు. వేశ్యల కుటుంబంలో పుట్టి, కట్టుబడులన్నిటికీ అతీతమైంది. నిత్య మంగళమై, ప్రతీ దినం వైవాహితయై, వైధవ్యం లేనిది. ప్రవహించే నదిని ఏ కళంకం మైల పరుస్తుంది? దప్పికతో ఉన్న మనిషి సేద తీరేది అక్కడే, మకిలపట్టిన మానవుడు మలిన ప్రక్షాళన చేసుకునేది దానిలోనే, మసిబారిన దేవతా విగ్రహాలు తళుకులాడినా అందులోనే. అన్నిటికీ అంగీకారమేగానీ దేనికీ అసమ్మతి చెప్పదు. ఆమె లాగా. ఎండి పోదు, అలసి పోదు. తుంగ - ఎన్నటికీ ఆవిరవ్వని, సొలసిపోని మహా నది.”
-- సంస్కార, కన్నడ నవల - జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత యు. ఆర్ అనంతమూర్తి (డిసెంబర్ 21, 1932 - 2014)
Comments
Post a Comment