చేలము
మే 25, 2021
చేలము (chēlamu)
అర్థము
(విశేష్యము): కప్పేది; వస్త్రము; చీర; దుప్పటి; (కుచేలుడు - చిరిగిన బట్టలు వేసుకునేవాడు)
Meaning
(noun) : a covering; garment; vestment; sari
వాడుక / Usage
నీ చంచల చేలాంచల స్వప్న సీమలలో నా హృదయం బంధింప పడింది.
My heart is a prisoner of the dreamy world at the ends of your fluttering sari. మెదడుకు మేత / Food for thought
"
“విసిగి వేసారి పోయాను నిరంతర జీవన సందిగ్ధంతో. దిక్కరిస్తున్నాను సమాజాన్ని ముక్కలైన మనసుతో. త్రొళ్ళుతున్న దుఃఖం నాది, ఎక్కడనుంచి తేను ఆనంద గీతాల్ని? జీవితంలో నాకు దొరికిందే కదా నేను తవ్వి ఇవ్వగలిగేది! కానీ లేస్తుంది ఉవ్వెత్తున నా ఊపిరి మరొకసారి. ఇప్పటిదాకా బ్రతుకు బండరాళ్ల కింద ఓటమితో ఒరిగిపోయాను. ఇదిగో ఈ రోజుతో తెంపేస్తున్నాను ఆశాబంధం. ఈపై మొరపెట్టను ఎవ్వరికీ, ఈపై ఆక్షేపించను ఎవ్వరినీ.”
-- ప్యాసా, సాహిర్ లూధియాన్వీ (మార్చ్ 8, 1921 - 1980) ఘజల్ యొక్క స్వేచ్ఛానువాదం
Comments
Post a Comment