రోచిస్సు

 

మే 26, 2021

రోచిస్సు (rōchissu)

    అర్థము

   (విశేష్యము): సూర్యకిరణము; వెలుగు; కాంతి;

   Meaning

   (noun) : a ray of light; splendour; brilliance

     వాడుక / Usage
   
 కరోనా గ్రహణంలో ఉన్న మన దేశానికి సౌఖ్య రోచిస్సు వచ్చే కాలం దగ్గరలోనే ఉంది.
  Soon we will emerge from the shadow of corona into the splendour of light.

    మెదడుకు మేత / Food for thought

"
“బ్రతుకులో ప్రతి ఒక్క విషజ్వాలను మింగేసాను. ఎందుకంటే అందులో నీ ప్రేమ తాలూకా ఒక్క బిందువు దొరుకుతుందని... మేలు మేలు నువ్వు ఇంకొకళ్ళ సొత్తు అయిపోయావు. ఇంక నిన్ను నా సొంతం చేసుకోవాలని తపన పడక్కర్లేదు...ఎప్పుడు, ఎలా? అది తెలియదు. నీ ఊహల కల్పన అయిపోతానేమో. ఆ కట్టుకథై గూఢమైన గీతగా విప్పారి నీ కాన్వాస్ మీద చేరతానేమో. చేరి నిన్నే తదైక్యంగా చూస్తాను.”

-- జ్ఞాన పీఠ్ గ్రహీత  అమ్రితా ప్రీతమ్ (ఆగష్టు 31, 1919 - 2005) పంజాబీ పలుకుల యొక్క స్వేచ్ఛానువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి