తరళము
మే 28, 2021
తరళము (taraḷamu)
అర్థము
(విశేషణము): చలించునది; చంచలమైనది; అనురాగము కలది; ప్రకాశించునది; (విశేష్యము) : హారమధ్య రత్నం; ఒక ఛందస్సు
Meaning
(adjective) : trembling; tremulous; unsteady; shy glance; bright; (noun) : pendant
వాడుక / Usage
"రాగరత్న మాలికా తరళము శంకరాభరణమూ.."
In the garland of Ragas, Sankarabharam is the brightest gem. మెదడుకు మేత / Food for thought
"
“నిరంతరం నేర్చుకుంటూ ఉండని గురువు, తన విద్యార్ధులకి సుసంపన్నంగా బోధించాలేడు. దీపం ఇంకో దీపాన్ని వెలిగించాలంటే తను స్వయంగా వెలుగుతూ ఉండాలి. తన విద్య అయిపోయిందని, దానితో ప్రతిదినం సహచర్యం చేయని గురువు, రోజూ విద్యార్థులకి వల్లెవేసి మెదడు నింపుతాడేగానీ బుద్ధి పెంపొందించలేడు. సత్యం ఒక్క సమాచారం కోసమే కాదు, మనల్ని ఉత్తేజితం కూడా చేయాలి. స్ఫూర్తి నశించిపోయి, కేవలం పరిజ్ఞానం పేరుకుపోతే సత్యం తన అనంతత్వాన్ని కోల్పోతుంది.”
-- గురుదేవ్ రబింద్రనాథ్ ఠాగూర్ (మే 7, 1861 - 1941)
Comments
Post a Comment