ఔర్వము

 

మే 05, 2021

ఔర్వము (aurvamu)

    అర్థము

   (విశేష్యము): బడబాగ్ని; ఔర్వ మహర్షి తపస్సుచే పుట్టిన మహాగ్ని  - సముద్రంలో విడిచాడు 

   Meaning

   (noun) :  devouring flame that burns under water; submarine fire

     వాడుక / Usage
   
   గుండెలో ఔర్వము ఉన్నా దానిని సున్నితంగా అభినయించడం మంచి నటుల లక్షణం.
    Expressing the burning torment of the heart subtly is the mark of a good actor.

    మెదడుకు మేత / Food for thought

"
"దట్టమైన చీకటి ఎంత అలుముకున్నా
  వెలుగు రేఖలపై కోటి తెరలున్నా 
  ఉదయించాలి సప్తాశ్వ రూఢుడు
  వికసించాలి భ్రమర కుసుమాలు

  ఘడియల భారం దుర్భరమైనా 
  కోల్పోలేదు నేను నా విశ్వాసాన్ని
  బాధ మొగ్గాలి తల మొగ్గాలి తల
  వ్యధ ఆగిపోవాలి కదా సమసిపోవాలి అలా

  డస్సిపోయారు అందరూ, ఒంటరయ్యారు ఎందరో
  కానీ, కానీ వస్తాయి మళ్ళీ తిరనాళ్ళు, మంచినాళ్ళు
  సమిష్టిగా పోరాడాలి కలిసి
  సమిష్టిగా ముందడుగు వేయాలి మనిసి"

-- రాంధారీ సింహ్ దినకర్  (సెప్టెంబర్ 23, 1908 - 1974) యొక్క హిందీ పద్యంకి నా స్వేచ్ఛ అనువాదం

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి