ఔపోసన

 

మే 07, 2021

ఔపోసన (auposana)

    అర్థము

   (క్రియ): ఎదైన విషయం మీద సమగ్రమైన పట్టు ఉండడం; ఉపాసనలా ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టడం 

   Meaning

   (verb) :  having consummate understanding on a topic

     వాడుక / Usage
   
   ప్రేమ మనసులతో ఎలా ఆడుకుంటుందో ఆత్రేయ ఔపోసన పట్టారు.
    Atreya had a virtuoso understanding of love and it's effects on heart.

    మెదడుకు మేత / Food for thought

"
"మౌనమె నీ భాష ఓ మూగ మనసా

తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానె కన్నీరౌతావు
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు

నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
మౌనమే నీ భాష ఓ మూగ మనసా

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు"
-- ఆచార్య ఆత్రేయ  (మే 7, 1921 - 1989)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి