సాపేక్ష

 

జూన్ 10, 2021

సాపేక్ష (sapeksha)

    అర్థము

   (విశేషణం): మరియొక దానిపై ఆధారపడిన; సాన్వయమైన; పరస్పర; ఐన్స్టెయిన్ యొక్క సిద్ధాంతం 

   Meaning

   (adjective) : relative; dependent; conditional; Einstein's theory of relativity

     వాడుక / Usage
   
 ఆస్తి ధరల సాపేక్ష స్థోమత  , బలమైన మౌలిక సదుపాయాలు హైదరాబాద్ ప్రత్యేకత. 
  Relative affordability of housing, good infrastructure make Hyderabad special.

    మెదడుకు మేత / Food for thought

"ఏది ఏమైనా మీకు స్వాగతం. భూమిని అభిషిక్తం చేసేటందుకు సువర్ణకలశంలో దివ్యకాంతిని నింపుకుని ప్రభావితం విచ్చేసినట్లు వచ్చే మీ రాకకై మౌనంగా వేచి ఉంటాను. రండి మిత్రమా - తొందరగా విచ్చేయండి. పచ్చిక బయళ్ళ మీద గోధూళి నేల జారకముందే గొల్లవాడు పిల్లనగ్రోవి సర్దుకోకముందే ఎర్రటి సూర్యడు నల్లకొండల వెనుకకు జారకముందే హేమవర్ణ కలశంలో పండు వెన్నెలని నింపుకుని వచ్చే మీ కోసం కలువలా వేచియుంటాను. ముకుళించుకున్నానేమని విచార పడకండి. ప్రొదున్న పూచి సాయంత్రం వాడిపోయే పూలలాగా - యుగాలే కాలగర్భంలో నిమజ్జనాలైపోతూ ఉంటే మనిషి ఎంత - అని రవీంద్ర కవీంద్రుడు అన్నట్లు."

-- వెన్నెల్లో ఆడపిల్ల, యండమూరి వీరేంద్రనాథ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి