ఒయ్యన

 

జూన్ 16, 2021

ఒయ్యన (oyyana)

    అర్థము

   (విశేష్యము): మెల్లన; నెమ్మదిగా; విలాసముగా; వయ్యారంగా

   Meaning

   (adverb) : with gentleness; softly; slowly

     వాడుక / Usage
   
 ఊపిరి బిగపట్టి అడుగులో అడుగు వేసుకుంటూ ఒయ్యన నడిచాడు.
  He held his breath and tiptoed gently.

    మెదడుకు మేత / Food for thought

"అన్నిటికన్నా మించి మనిషి ఆలోచనకి భయపడతాడు - నాశనం అవడం కన్నా, మృత్యువు కన్నా కూడా. ఆలోచన విధ్వంసకం, విప్లవాత్మకం, భయంకరం. అది ఆధిక్యత మీద దయ చూపదు. వ్యవస్థలను గౌరవించదు. అలవాట్ల సౌఖ్యాన్ని గుర్తించదు. ఆలోచన అరాచకం, నియమ విరుద్ధం. అధికారాన్ని లెక్క చేయదు. తరతరాల కట్టుబాట్లని ఖాతరు పెట్టదు. నరక కూపంలోకి తొంగి చూస్తుందికాని భయపడదు...ఆలోచన గొప్పది, వడిగలది. అన్నింటికన్నా స్వంతంత్రమైనది. అది ప్రపంచానికి వెలుగు చూపే దివిటీ. మానవుని కీర్తి పతాకం."

--బ్రిటిష్ తత్వవేత్త, తార్కికుడు, నాస్తికవాది, బెర్ట్రాండ్ రస్సెల్ (మే 18, 1872 - 1970)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి