చెలువము

 

జూన్ 17, 2021

చెలువము (cheluvamu)

    అర్థము

   (విశేష్యము): అందము, సౌందర్యము; విధము, పద్ధతి

   Meaning

   (noun) : beauty, elegance; manner, way

     వాడుక / Usage
   
 జాబిల్లి రావే, కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే.
  Come O Moon! Rise over the hills, let the beautiful dreams of the lily blossom.

    మెదడుకు మేత / Food for thought

"కోరికలు మరియు నారీ సొగసుల కామం వల్ల మాయలో పడి మునిగిపోకు. ఇవన్నీ మాంసంముద్ద పైన మెరుగులు మాత్రమే. ఇలా మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవటం మరువకు. తామరాకుపైన వానచినుకులు పడి దొర్లినట్లుగా మనిషియొక్క జీవితం అనిశ్చితం. ప్రపంచం అహం, రోగ, శోకాలకు గురౌతూనే ఉంటుంది అని తెలుసుకో! నీ భార్య ఎవరు? నీ పుత్రుడెవ్వడు? ఈ విచిత్ర ప్రపంచము. నీవు ఎవ్వడవు ? నీవు ఎక్కడ నుండి వచ్చావు? సోదరా! ఈ సత్యాలని ఆలోచించు. యవ్వనం లేనప్పుడు కామం ఎందుకు? నీరు లేని చెరువు వల్ల ఉపయోగమేమి? ధనం పోయినపుడు బంధువులెక్కడ? సత్యం తెలిసాక ప్రపంచమెక్కడ? పగలు రాత్రి, ఉదయం సాయంత్రం, శిశిరం వసంతం వస్తుంటాయి పోతుంటాయి. కాలం జీవితమనే కెరటాలతో ఆడుతుంటుంది. కానీ కోరికలనే తుఫాను ఎప్పటికీ పోదు. ఓ వెఱ్ఱి మనిషీ ! ఎందుకు ఆలా ధన వ్యామోహన ఆలోచనలలో మునిగిపోతావు ? నీకు మార్గనిర్దేశం చేసేవారు ఎవ్వరూ లేరా ? సంసార సాగరం నుండి నిన్ను వెంటనే కాపాడే నావ ముల్లోకాల్లోకెల్లా ఒక్కటే ఉంది,అదే సత్సంగం."

-- భజ గోవిందం భజ గోవిందం, శ్రీ ఆది శంకరాచార్య

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి