చెంగలువ
జూన్ 23, 2021
చెంగలువ (chen-galuva)
అర్థము
(విశేష్యము): ఎర్ర కలువ; చెన్ను - ఎరుపు; కలువ - జల పుష్పము
Meaning
(noun) : red water lily
వాడుక / Usage
వెన్నెల రాత్రులలో చెంగలువలలా మెరిసే ప్రియురాలి అధరాలకు ఓం నమః.
Glorious are the lips of the lover shining like the red water lilies on a moonlit night. మెదడుకు మేత / Food for thought
"నగవులే నగవులై, బిగువులే బిగువులై
సొగసులే సొగసులై, జూడ్కులే జూడ్కులైదొలుకారు మెఱపుల్లు దోబూచులాడినటుఁ
దొలిచూలికన్నె కోర్కులు విచ్చికొన్న యటుఁ
దొలుసారి రతి వింతసొలపు గ్రమ్మినయట్లుఁ
దొలిగట్లుపైజొత్తు బులకరించిన యట్లుఁ
దొలుసంజలోఁ దెల్వి దూకివచ్చిన యట్లు
మలుసంజలోఁ గాంతి మరలిపోయిన యట్లు
గులుకునీలపుఁగండ్లఁ దళుకుజూపులు బూయ
ఘలుఘల్లుమని గాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ
ఆడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు"
-- శివతాండవము, పుట్టపర్తి నారాయణాచార్యులు (మార్చ్ 28, 1914 - 1990)
Comments
Post a Comment