కౌముది
జూన్ 25, 2021
కౌముది (kaumudi)
అర్థము
(విశేష్యము): వెన్నెల; చంద్రిక;కార్తీక పౌర్ణమి; పండుగ; చల్లని కాంతి వెదజల్లునది
Meaning
(noun) : moonlight; anything producing coolness like moonlight; festival
వాడుక / Usage
గలగలా పారే కృష్ణమ్మ తీరాన మిలమిలా మెరిసే కౌముదిలో అభిసారికై వేచింది.
She waited for her beloved on the moonlit banks of Krishna. మెదడుకు మేత / Food for thought
"అలసత యొప్పనల్లన రతాంతమునం బ్రియునొద్దఁ బాసి నె
చ్చెలికడ కేఁగుదెంచు సరసీరుహనేత్ర విలోచనంబులందలఁకెడు మందహాసము విధంబున సొంపున మీఱియున్న చెం
గలువలలోన నింపడరు కౌముది వేడ్కలొనర్చెఁ జూడ్కికిన్"
(రతి అనంతరం అలిసిపోయి పడుకున్న ప్రియుడిని వదిలి సఖుల దగ్గరకు వెళ్లే యువతి యొక్క కమలనయనాలలో చిందే చిలిపి చిరునవ్వు లాగా ముచ్చటగా ఉందట ఆ ఎర్ర కలువలలో మెరిసే నిండు వెన్నెల)
-- నిర్వచనోత్తర రామాయణం, తిక్కన సోమయాజి (1205 - 1288)
Comments
Post a Comment