పరివ్రాజకుడు

 

జూన్ 29, 2021

పరివ్రాజకుడు (pari-vrājakuḍu)

    అర్థము

   (విశేష్యము): సన్యాసి; వ్రజ అనగా సంచరించడం; విషయ భోగాలని త్యజించి తిరిగేవారు.

   Meaning

   (noun) : mendicant; Sanyasi; monk

     వాడుక / Usage
   
చిన్నపాటి పరివ్రాజకుడు కొండల్లో తిరుగుతాడు, సర్వ సంగపరిత్యాగి నగరంలో జీవిస్తాడు.
  A new monk might roam the hills but an enlightened one lives in society.

    మెదడుకు మేత / Food for thought

"మన దేశంలో కవిత్వం కవితా పద్ధతులు కవితా శైలి రకరకాలుగా ప్రవహించింది. కానీ మన దగ్గర తెలుగులో భావంతో పాటు పాండిత్యం కూడా, పాండిత్యంతో పాటు శబ్ధాధిపత్యం కూడా లేకపోతే పూర్తిగా కవి ఎన్నడూ రాణించలేదు. కంప్యూటర్లు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తికి అంత ప్రాముఖ్యత లేదు. కానీ దానికి తనం లేదు. నో సెన్స్. అది మన దగ్గర ఉంది. మీరు ఎంత విజ్ఞానములో ముందుకు వెళ్ళిపోయినా మనిషిని మీరు రీప్లేస్ చేయలేరు. ఎంత యంత్రాలు లేక టెక్నాలజీ వచ్చిన దానికి జనకులు మనం. Technology is a very good servant but bad master. దానికి మనం వశం అయిపోతే మాత్రం ప్రపంచం నిలవదు. మానవుడు తన బుద్ధినిగాని తన భావుకతనిగాని ఇంకెవరికో ఇచ్చే పరిస్థితి లేదు, ఇస్తే అంతకన్నా తప్పుడు పని లేదు."

-- మాజీ ప్రధాని పాములపర్తి నరసింహారావు (జూన్ 28, 1921 - 2004)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి