పుంఖానుపుంఖము

 

జూన్ 30, 2021

పుంఖానుపుంఖము (pumkha-nu-pumkhamu)

    అర్థము

   (విశేష్యము): వెనువెంట; ఒకదాని మీద ఒకటి; గుంపులు గుంపులుగా; ముమ్మరంగా

   Meaning

   (adjective) : in rapid succession 

     వాడుక / Usage
   
సామజిక మాధ్యమాలలో పుంఖానుపుంఖాలుగా వచ్చే మతపరమైన సందేశాలు కారుచిచ్చు పెడుతున్నాయి.
  The barrage of religious messages on social media are adding fuel to fire.

    మెదడుకు మేత / Food for thought

"ఈరోజుకీ నాకు ఆ ఇద్దరు ఇటాలియన్ అమ్మాయిలు ఏమి పాడారో దేనిగురించి పాడారో తెలియదు. నిజం చెప్పాలంటే అసలు తెలుసుకోవాలని కూడా లేదు. కొన్ని విషయాలు పదాల్లో పెట్టకపోవడమే మంచిది, అర్థం కాక పోవడమే ఉత్తమం. ఎంతో అందమైన వర్ణనాతీతమైన దానిగురించి వాళ్ళు పడుతున్నారని ఊహించుకోవడంలోనే ఆనందం ఉంది. ఆ అద్వితీయ సౌందర్యం మాటలలో చెప్పడానికి అలవి కాక హృదయానికి తీపి బాధ కలగచేసిందేమో. నేను చెప్తున్నాను, ఆ నాదాలు గగన సీమలలో విహంగ వీక్షణ చేసాయి. వెలుగు దూరని చీకటి మూలలో ఎవ్వరూ కలగనలేని ఎత్తులకు ఎగిరాయి ఆ అమ్మాయిల గాత్రాలు. రమ్యమైన రాజహంస విప్పారిన రెక్కలతో మా ప్రాణరహితమైన పంజరంలోకి వచ్చి విచ్చుకున్న ఆ వెలుగుతో ఆ ఎత్తైన గోడల్ని కరిగించి స్వాతంత్రాన్ని పంచినట్లు అనిపించింది."

-- ఆంగ్ల చలనచిత్రం షాషాంక్ రెడెంప్షన్, ఓపెరా సీన్లో 'రెడ్' మొర్గన్ ఫ్రీమన్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి