జడత్వము

 

జూన్ 09, 2021

జడత్వము (jaḍatvamu)

    అర్థము

   (విశేష్యము): తెలివి లేకుండుట; విశ్రాంతిలో గాని స్థిర చలనంలో ఉన్న వస్తువు గాని దానిస్థితి మార్చుకొనకుండ ఉండు గుణము

   Meaning

   (noun) : stupidity; inertia

     వాడుక / Usage
   
 అజ్ఞానము, జడత్వము, నిర్లక్ష్యము, మరియు మోహము తమో గుణము యొక్క లక్షణములు.
  I
nertia, negligence, and delusion are the signs of ignorance.

    మెదడుకు మేత / Food for thought

"పసిడి మెఱుంగుల తళతళలు
పసిమి వెలుంగుల మిలమిలలు గౌతమి కృష్ణల గలగలలు గుడి జేగంటల గణగణలు మొఱసి, మొరసి మించిన శుభసమయము తల్లీ! తరళ యశోవతి! అనుపమిత రాగవల్లీ! నీవరసంతతి చేమోడ్పులివె తెలుగుతల్లీ! కవిపికముల సల్లాపములు గాయక బర్హ్యాలాపములు లాస్యత్ఖగ విన్యాసములు భాస్వత్పటహ నినాదములు విరిసి, మ్రోగి, పఱచిన శుభసమయము తల్లీ సరళోక్తి మధురసవతీ! కోమలవల్లీ! నీవరసంతతి చేమౌడ్పు లివె తెలుగుతల్లీ! హాలికజన కలహాసములు శ్రామికజన మధుహాసములు దాస్యవిముక్త నివాసములు స్వతంత్రప్రభావికాసములు ఒలసి, మెలసి, చెలగిన శుభసమయము తల్లీ! చరణార్పిత కోటిషట్కహృత్సుమవల్లీ! నీవరసంతతి చేమోడ్పులివె తెలుగు తల్లీ!"

-- 1948 లో ఆకాశవాణి విజయవాడ ప్రారంభ గీతిక, డా. బాలాంత్రపు రజినీకాంత రావు (జనవరి 29, 1920 - 2018)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి