అనలము

 

అక్టోబర్ 12, 2021

అనలము (analamu)

    అర్థము

   (విశేష్యము): అగ్ని; అన్నము ఆరగించు జఠరాగ్ని; కోపము; పరమాత్మ

   Meaning

   (noun) : fire; gastric fire; digestive power; fury
     
   వాడుక / Usage

   వాతావరణ మార్పు వల్ల అరణ్య అనలాల తీవ్రత హెచ్చుతోంది.
   Climate change is increasing the severity of forest fires.

   మెదడుకు మేత / Food for thought

   భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని
  వైప్లవ్యగీతాన్ని నేను!
  స్మరిస్తే పద్యం,
  అరిస్తే వాద్యం,
  అనల వేదికముందు అస్రనైవేద్యం!
  లోకాలు, భవభూతి శ్లోకాలు,
  పరమేష్ఠి జూకాలు నా మహోద్రేకాలు!
  నా ఊహ చాంపేయమాల!
  రస రాజ్యడోల!
  నా ఊళ కేదారగౌళ!
  గిరులు, సాగరులు, కం కేళికా మంజరులు,
  ఝరులు నా సోదరులు!
  నే నొక దుర్గం! నాదొక స్వర్గం!
  అనర్గళం, అనితరసాధ్యం, నా మార్గం;

  -- మహాప్రస్థానం, శ్రీశ్రీ (ఏప్రిల్ 30, 1910 - 1983)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి