కపాటము

 

అక్టోబర్ 13, 2021

కపాటము (kapāṭamu)

    అర్థము

   (విశేష్యము): కవాటము, తలుపు; ఒక వైపునకు పోవు పదార్థమును వెనుకకు రాకుండా ఒక వైపే తెరుచుకునే తలుపు

   Meaning

   (noun) : door; valve
     
   వాడుక / Usage

   కపటంతో ఆమె హృదయ కపాటం తట్టలేడని అర్థం అయ్యింది.
   It became apparent that deceit cannot knock on the doors of her heart.

   మెదడుకు మేత / Food for thought

   అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
   ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి వుచ్చిన యమ్మ, తన్ను లో
   నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
   యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్

   (దుర్గాదేవి తల్లు లందరికి తల్లి సప్తమాతృకలను కన్నతల్లి, ముల్లోకాలకు మూల మైన లక్ష్మి సరస్వతి పార్వతులకే మూలమైన తల్లి, అందరు అమ్మల కన్నా అధికురా లైన మహాతల్లి, రక్కసి మూకలను అడగించిన యమ్మ, నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి. అట్టి మా అమ్మ దయాసముద్రి అయ్యి నా భాగవత ఆంధ్రీకరణ ప్రణీత మందు కవిత్వంలో గొప్పదనము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక)

  -- శ్రీమద్భాగవతం, పోతన (1450 - 1510)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి