ఉర్వి
అక్టోబర్ 14, 2021
ఉర్వి (urvi)
అర్థము
(విశేష్యము): భూమి; నేల; నది; విశ్వము; వెడల్పు గలది
Meaning
(noun) : earth; land; river; world; that which is wide
వాడుక / Usage
ఓరిమితో మనలను కాసే ఉర్విని మనమే భ్రష్టు పట్టిస్తున్నాము.
We are destroying the very earth which protects us.
మెదడుకు మేత / Food for thought
అక్షరాలు ఒళ్లో పోసుకొని ఎవరూ కూర్చోరు. ఆ మాట కొస్తే అక్షరాలు ఊరికే రావు. ఊకనే పోవు. ఎర్రటి ఎండల కాగుతున్న పరుబ్బండ మీద పాదం మోపి చూడు. కర్రుమొన గుచ్చిన కరియావు కాలి గిట్టల సందుల స్రవించిన రక్తం పదను నంటి చూడు. బిగబట్టిన ఊపిరితో ఒక్కసారిగ పైకెగరేసుకుపోతున్న వలలోని పక్షుల గుండెల ఆరాట ధ్వనిని చెవియొగ్గి చూడు. కత్తుల వంతెన, నిప్పుల వాగు, దినదిన గండం బతుకులకు పర్యాయ పదాలైన సందర్భాల నొలిచి చూడు. అక్షరం అవసరమేంటో,అది చేయాల్సిన పనేంటో అవగతమయితది. కలలు కనాలంటే జీవితం కావాలి. విజయం దక్కాలంటే యుద్దం చేయాలి.విలువలు కావాలంటే మనసులు విశాలమవ్వాలి. మనుషులు వికసనం చెందాలి. యివన్నీ కవిత్వం నీడలోనే. కవిత్వం నడయాడే జాడలోనే. నిన్ను ఆపేది కవిత్వం. నిన్ను ఊపేది కవిత్వం. నిన్ను రేపటి ఉదయానికి కృతజ్ఞతా పూర్వక నమస్కారం పెట్టించేది కవిత్వం. ఉట్టి గట్టిన ఆకాశం మీంచి ఊడిపడదు కవిత్వం. బంగారు గని నుంచి ఉబికి రాదు కవిత్వం. బతుకులోంచి తోడుకొనేది కవిత్వం. బతుకులో వొంపేది కవిత్వం. నిన్ను బతికించేది కవిత్వం. నీతో బతికేది కవిత్వం.
-- దాసరాజు రామారావు (https://telugu.asianetnews.com/literature/dasaraju-rama-rao-after-reading-kavi-yakoob-teegala-chinta-poetry-book-q1ily5)
Comments
Post a Comment