బింబము
అక్టోబర్ 15, 2021
బింబము (bimbamu)
అర్థము
(విశేష్యము): ప్రతిమ; చంద్ర/సూర్య మండలం; దొండపండు;
Meaning
(noun) : image; reflection; round disc like sun/moon; fruit of Coccinia indica
వాడుక / Usage
చంద్రబింబం వంటి ముఖంతో ఆ బింబాధరి అత్యంత రమణీయంగా ఉంది.
Her radiant face and red lips were enamouring.
మెదడుకు మేత / Food for thought
జుట్టు ఆరబెట్టుకుంటూ
ఆకాశంలోకి చూపులెగరేసిన
ఒక తడి తడి జ్ఞాపకపు బొమ్మ.
ప్రమిదల కాంతి రథమ్మీద కూర్చొని
స్వారికి వెడలిన కాలనాళిక
కొన్ని అవశేష అస్థికల జీవితాన్ని
మోక్షం మార్గాన రేవుకు చేర్చే పడవ,
కాశీ రాజు కోటకు వీపునాన్చి
నీళ్ళల్లో పాదాలు ఆడిస్తున్న పసిపాప.
పాప ప్రక్షాళన కోసం పరుగులెత్తున్న కాలానికీ
ఎదురుగా వచ్చి చేయందించే మనిషి
-- గంగా నది గురించి 'తీగల చింత' లో , కవి యాకుబ్
Comments
Post a Comment