వర్తమానం
అక్టోబర్ 18, 2021
వర్తమానం (vartamanam)
అర్థము
(విశేష్యము): సమాచారం (ఇతరులకు పంపేది); జరుగుతున్న కాలం; వృత్తాంతం
Meaning
(noun) :information/news (sent to someone); present tense;
వాడుక / Usage
మార్పునకు ఆతిథ్యం ఇచ్చే వర్తమానం ఎల్లప్పుడూ నిత్య నూతనం.
A present that is open to change is forever new.
మెదడుకు మేత / Food for thought
ఎంతో కాలంగా నిద్రకు దూరమైన ఆమెకు ఈరోజు నిద్ర మీద విపరీతమైన కోరిక కలిగింది. హాయిగా శవంలాగా నిద్రపోవాలనిపించింది. ఎన్నాళ్లగానో తీరని కోరిక అది....ఇలా ఇంకా ఎంత కాలం నిద్రలేకుండా ఉండాలి. ఆమెకు జీవితం మీదే విరక్తి కలిగింది. మరో నిద్రమాత్ర వేసుకుందామని సీసాను చేతిలో ఒంపుకుంది. సీసాలోని మాత్రలన్ని చేతిలో పడ్డాయి! ఆ మాత్రలు తమని తీసుకోమని ఆమెను ఆహ్వానిస్తున్నాయి. ప్రతీ మాత్రలో నిద్ర ఉంది. అన్నీ మాత్రల్లో ఉన్న నిద్ర ఆమెకు కావాలి. భర్తకు ఒక చిన్న చీటీ రాసి పెట్టింది - "ఏమండీ ఆత్మహత్య చేసుకున్నాను అనుకోకండి! నిజంగా నిద్ర కోసం నిద్ర పోతున్నాను!"
-- సుఖాంతం (కథ), సాహిత్య అకాడెమి పురస్కార గ్రహీత అబ్బూరి ఛాయాదేవి (అక్టోబర్ 13, 1933 - 2019)
Comments
Post a Comment