కాలాతీతం
అక్టోబర్ 19, 2021
కాలాతీతం (kal-ātītam)
అర్థము
"నువ్వెందుకు పెండ్లి చేసుకోలేదో నాకు తెలుసు. నాకోసం" అంటూ మళ్లా కళ్ళు మూసింది. నా గుండె స్థూలత్వాన్ని పోగొట్టుకుని ద్రవంగా విడిపోయి, దోవ తెలియక తిరుగుతున్న రక్తనాళాలగుండా, వుజ్వల వేగంతో ప్రవహిస్తుంది. కన్నీటిని నా వేళ్ళతో తొలగించుకొన్నాను. ఆమె నిశ్చల శరీరంపై నా కన్నీరు పడి మలినం చెయ్యడం పాపం అనిపించింది. మొహాన్ని పక్కకు తిప్పేసుకున్నాను. కిటికీ అద్దంలోనుంచి నిశీధి నల్లత్రాచులా లోకాన్ని అల్లుకుంటోంది.
"నీ స్థితి చూస్తే నాకెంతో బాధగా వుంది" అన్నా కన్నీరు దిగమింగుకుని.
"నాకు నిర్విచారం.. ఈ ప్రపంచం నాదైతేగా విచారానికి , నువ్వు మాత్రం.." కళ్లు మూసి మరి విప్పలేదు. ఈ లోకంలో మూసుకుని మరో లోకంలో తెరుచుకున్న నేత్రాలు కుముదానివి. ఆత్మని దిగి విడిచి వచ్చిన వ్యక్తి మళ్ళా దానిలోకే చేరుకుంది. చెట్లు,, నదులు, మేఘాలు, చీకటి వెలుగుల సమ్మేళనంతో గిరగిరా తిరిగిపోతున్న విశ్వంలోకి కలిసిపోయింది. నిషీధిలోకి నడిచి వెళ్ళావు. మహత్తర అనుభవం సంభవించినప్పుడు, తార్కిక జ్ఞానం, విమర్శనాబుద్ధి పని చెయ్యవు. ఇంద్రియాలు శరీరాన్ని వూపి,కొత్త జన్మనిస్తాయి. భావోద్రేకంలో నిమగ్నుడై చైతన్య ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తి, ఒక్కసారి సృష్టి రహస్యాన్ని, మెరుపులా చేదించి మరో అవతారం దాలుస్తాడు. చచ్చి బ్రతకడంలాంటిది ఆ అనుభవం.
Comments
Post a Comment