భవితవ్యం

 

అక్టోబర్ 20, 2021

భవితవ్యం (bhavitavyam)

    అర్థము

   (విశేష్యము): మంగళము; శుభము; (విశేషణము): జరుగదగునది; కాబోయేది

   Meaning

   (noun) : good tidings; (adj): that which is likely to happen
     
   వాడుక / Usage

   పొట్టి శ్రీరాములు ప్రాణాలొడ్డి సాధించిన రాష్ట్ర భవితవ్యం నేడు కుక్కలు చింపిన విస్తరిలా ఉంది.
   The future of the state that Potti Sri Ramulu sacrificed his life for looks bleak.

   మెదడుకు మేత / Food for thought

దేవుడు బాల్యంలో ఉండగా చెట్లు మొక్కలు వృక్షాలు నదీనదాలు సముద్రాలూ సృష్టించి ఉంటాడు - ఆడుకోవడానికి. యవ్వనంలోకి వచ్చాక సాహసాలు పరాక్రమాలు విజయాలు విపరీతాలు సృష్టించి ఉంటాడు - ఎదురుకోడానికి. నడివయసులోకి వచ్చాక సమస్యలు సుడిగుండాలు బాదరబందీలు భయానకాలు సృష్టించి ఉంటాడు - వేగడానికి. వయసు ముదిరాక రోగాలు రొష్టులు ప్రమాదాలు ఉత్పాతాలు సృష్టించి ఉంటాడు - మరణించడానికి.....బాల్యానికి బాల్యం ప్రసాదించమని వేడుకునే కథ.


  -- బాల్యం బుగ్గన ఒక ముద్దు, మహమ్మద్ ఖదీర్ బాబు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి