చరమాంకం

 

అక్టోబర్ 21, 2021

చరమాంకం (charamnkam)

    అర్థము

   (విశేష్యము):  అంతిమ దశ ; చరమ = ఆఖరి / తుది, అంకం = నాటకంలో  భాగము

   Meaning

   (noun) : death knell; final stage
     
   వాడుక / Usage

   సమాచార హక్కు చట్టానికి ఇదే చరమాంకం.
   It is the death knell for the Right to Information Act.

   మెదడుకు మేత / Food for thought

ముల్లు వెళ్లి అరిటాకు మీద పడితే? అరిటాకు వెళ్లి ముల్లు మీద పడితే? ఇదో పెద్ద భయం మనకు. ఏమవుతుంది? చిరిగితే ఒక ఆకు చిరుగుతుంది. అంత మాత్రాన చెట్టు మొత్తానికి ఉనికి లేకుండా పోతుందా? చెట్టున చిగురించిన ఇతర ఆకులకు అర్థం లేకుండా పోతుందా? చెట్టు యవ్వనం చెట్టు ఆయుష్షు చెట్టు దిగవిడువబోయే మధుర ఫలాల గెల...ఇవేవి లేకుండా పోతాయా? ముల్లు పడితే ముల్లును చూడాలి, తీసిపారేయాలి. తర్వాత ఆకును కూడా పక్కన పెట్టి ఆ తర్వాత కథ చూడాలి. అదీ కథ. జీవితం అదే కదా.


  -- వాడ్రేవు చిన వీరభద్రుడు రాసిన సుజాత కథకి, మహమ్మద్ ఖదీర్ బాబు రీటెల్లింగ్

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి