గతజలసేతుబంధనం
అక్టోబర్ 22, 2021
గతజలసేతుబంధనం (gatha-jala-sethu-bandhanam)
అర్థము
“రాతిగుండెల మనుషుల మధ్య ఎన్నో దేశాలు తిరిగాను. ఎటు చూసినా రాతిగోడలు లేవడం చూశాను. ఎవరూ కూల్చలేని గొప్ప గొప్ప రాతిగోడలు. మనుషులకూ మనుషులకూ మధ్య రాతి గోడలు. కొట్టుకు చావడంలో కొందరు, డబ్బు సంపాయించడంలో కొందరు మునిగి తేలుతున్నారు. ప్రకృతిని ప్రేమించలేనివాళ్ల మధ్య నాకూ, నా మురళికీ చోటు లేదు. అందుకే ఇక్కడికి వచ్చేశాను. ఇదే నా చోటు. ఇంకెప్పుడూ నేను మళ్ళీ అక్కడికి రాను. కలకాలం ఇక్కడే మురళి పాట పాడుకుంటాను” అంటూ మురళి ఊదే పాపడు మళ్ళీ పిల్లనగ్రోవి అందుకున్నాడు. ఆ మధురమైన సంగీతానికి మళ్ళీ ఆవులు తలూప నారంభించాయి. మళ్ళీ పిట్టలు గంతులేస్తూ ఎగర నారంభించాయి. మబ్బులు అమృతం కురిపిస్తున్నాయి. “పాపడా” అని అరుస్తూ ఆ అమ్మాయి చేతులు చాచి ముందుకు పరుగెత్తింది. ఆ అమ్మాయిని సమాధి చేసిన చోటనే చిత్రంగా ఒక అందమైన చెట్టు మొలిచింది. వానకారు అవసరం లేని చెట్టు. అమృతంతో పెరిగే చెట్టు. భూమండలం మీద మిగిలిన ఒకే ఒక చెట్టు. ఆ చెట్టు నీడలో విశ్రమించడానికి ఎక్కడెక్కడి నుంచో జనం వస్తూంటారు. అలా విశ్రమించిన వారికి రహస్యంగా ఒక పిల్లనగ్రోవి పాట వినిపిస్తుందని చెబుతారు.
Comments
Post a Comment