ఉగ్రాణము

 

అక్టోబర్ 27, 2021

ఉగ్రాణము (ugrāṇamu)

    అర్థము

   (విశేష్యము):  ధనము దాచే చోటు; కోశాగారం; సామాగ్రి ఉంచే చోటు; కొట్టు; వంటసాల; బొక్కసం

   Meaning

   (noun) : store house; treasury; pantry
     
   వాడుక / Usage

  పంచినకొలది తరిగేది ఉగ్రాణంలోని ధనం, పంచినకొలది పెరిగేది హృదయకోశంలోని విద్య.
  Wealth in the treasury depletes when shared but knowledge increases with sharing.

   మెదడుకు మేత / Food for thought

“మనిషిగా మనం ఆధారపడేది దేనిమీద? మన పదాల మీద...ఇంకొకరికి మన అనుభవాలు మన ఆలోచనలు తెలియచేయడం మన విధి. నిరంతరం మానవాళికి తెలిసిన జ్ఞాన పొలిమేరలను పెంపొందించడం మన కర్తవ్యం. కానీ మనం చెప్పేవి నిష్పాక్షికమై అసందిగ్ధం లేకుండా ఉండాలి. వాస్తవికత అనేది కూడా పదమే. ఆ పదాన్ని సరైన రీతిలో వాడడం నేర్చుకోవాలి."


  -- నీల్స్ బోర్ (అక్టోబర్ 7, 1885 - 1962), "ఫిలాసఫీ ఆఫ్ సైన్స్"

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి