దప్పళం
అక్టోబర్ 07, 2021
దప్పళం (dappaḷamụ)
అర్థము
(విశేష్యము): కూరలు వేసి పలచగా కాచిన (కంది పప్పు) పులుసు; సాంబారు; ముక్కల పులుసు
Meaning
(noun) : sour soup made with lentils and vegetables; Sambar
వాడుక / Usage
"వేడి వేడి అన్నంలో కమ్మని పప్పు కాచిన నెయ్యి, పప్పు దప్పళం కలిపి కొట్టడం" (పెళ్లి పుస్తకం)
Hot rice with ghee, dal and Sambar!
మెదడుకు మేత / Food for thought
అపాయమ్ము దాటడానికుపాయమ్ము కావాలి
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
అంధకారమలమినపుడు వెలుతురుకై వెదకాలి
ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు
సోమరియై కునుకువాడు సూక్ష్మమ్ము గ్రహించలేడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు
జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగక పోతే ఊరక చతికిలబడి పోదురు
కండ బలము తోటే ఘన కార్యము సాధించలేరు
బుద్ధి బలము తోడైతే విజయమ్ము వరింపగలరు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా
పిరికితనము కట్టిబెట్టి ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినక పోతే నీ ఖర్మం
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు
జీవితమున సగ భాగం నిద్దురకే సరిపోవు
మిగిలిన ఆ సగ భాగం చిత్తశుద్ధి లేకపోవు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు
అతినిద్రా లోలుడు తెలివి లేని మూర్ఖుడు
పరమార్ధం గానలేక వ్యర్ధంగా చెడతాడు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
సాగినంత కాలం నా అంత వాడు లేడందురు
సాగక పోతే ఊరక చతికిలబడి పోదురు
కండ బలము తోటే ఘన కార్యము సాధించలేరు
బుద్ధి బలము తోడైతే విజయమ్ము వరింపగలరు
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా
చుట్టుముట్టు ఆపదలను మట్టుబెట్ట బూనుమురా
పిరికితనము కట్టిబెట్టి ధైర్యము చేపట్టుమురా
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
కర్తవ్యము నీ వంతు కాపాడుట నా వంతు
చెప్పడమే నా ధర్మం వినక పోతే నీ ఖర్మం
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
ఆ మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా
మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా
--శ్రీ కృష్ణ పాండవీయం (1966), కొసరాజు (జూన్ 23, 1905 - 1987)
Comments
Post a Comment