ఉటంకి
అక్టోబర్ 08, 2021
ఉటంకి (uṭanki)
అర్థము
(విశేష్యము): బియ్యం, పాలు, పంచదార కలిపిన పిండితో తీగలు లాగా వేయించిన శ్రీకాకుళం జిల్లా వంటకం
Meaning
(noun) : stringed sweet made, in Srikakulam, of rice, milk and sugar
వాడుక / Usage
సోంపేట వాస్తవ్యులైన కింతలి దంపతులు తయారుచేసే ఉటంకులు ప్రపంచ ప్రసిద్ధం.
Sompeta is renowned for the sweet Utanki made by Kinthali family.
మెదడుకు మేత / Food for thought
గొంతుకలు వస్తున్న నూతిలో నీళ్ళు లేవు..అదొక పాడు నుయ్యి.మనిషి పతనానికీ ,మరణానికీ సంకేతం. అందులో జీవనం వుండదు.అందులో పడి వున్న వారికి వెలుగు గోచరించదు.పైకి ప్రాకటానికి ఆధారం కనిపించదు. వారు కేకలు వేస్తారు.కాని వారి గొంతులు బయటకు స్పష్టంగా వినిపించవు..భూగర్భపు లోతులు వారిని బాహ్య ప్రపంచాన్నుంచి వేరు పరుస్తోంది.వారు యాత్రికులు కూడా కాదు.వారికొక గమ్యం లేదు.చీకటి తప్ప వారికెవ్వరూ తోడు లేరు.
రాత్రి అయింది. శబ్దం లేదు.
గాలి లేదు. చీకటికి జాలి లేదు
ఈ పెను చీకటి నిముసం బ్రతుకుల
నల్లని కుబుసం కాలమనే భయంకర సర్పం
మన్ను మిన్ను చేసి పొరలు తోంది
గాలి లేదు. చీకటికి జాలి లేదు
ఈ పెను చీకటి నిముసం బ్రతుకుల
నల్లని కుబుసం కాలమనే భయంకర సర్పం
మన్ను మిన్ను చేసి పొరలు తోంది
--నూతిలో గొంతుకలు, ఆలూరి బైరాగి (నవంబర్ 5, 1925 - 1978)
Comments
Post a Comment