విరాళి

 

ఆగష్టు 04, 2022

విరాళి (virali)

    అర్థము

   (విశేష్యము): వలపు; మోహము; ప్రేమ; భక్తి

   Meaning

   (noun) : love; passion; piety; devotion 

   వాడుక / Usage

 "విరాళి ఎదలో స్వరాల రొదతో పదము పాడనా ఆడనా" మయూరి, ఆత్రేయ
 Love in heart, crescendo of notes along, crooning and dancing am I.

   మెదడుకు మేత / Food for thought

కాళీపట్నం రామారావుగారి కథల్లో మన మనస్సులకి ఆహ్లాదం కలిగించే విషయాలు ఆట్టే కనిపించవు. సాహిత్యం సుఖం కలిగించాలి అనుకునేవాళ్ళకు ఇవి నప్పవు. అలా అని రామారావుగారి కథలు మనని దుఃఖపెట్టవు కూడా. లోకంలో కావలసినంత దుఖం వుంది. దాన్ని సాహిత్యంలో ఏడుపుగా మార్చి పాఠకులకి కన్నీళ్ళు తెప్పించి అలా ఏడవగలిగిన పాఠకులు హాయిగా తృప్తి పొందే కథలూ, కావ్యాలూ మనం ఎరుగుదుం. రామారావుగారి కథలు ఈ పని చెయ్యవు. ఇవి మనం భరించలేని అశాంతిని మనలో కలిగించి మనకి స్తిమితంగా నిద్రపట్టకుండా చేస్తాయి. మనకి ఏది తెలియకపోవడం వల్ల మన జీవితాల్లోనూ, సమాజంలోనూ వున్న పరిస్థితులతో సర్దుకుపోతూ బతుకుతున్నామో అది తెలియజెప్పేస్తాయి. ఇంక ఆ తర్వాత మనం నిబ్బరంగా వుండలేం. వున్న పరిస్థితులకి మనం కారణమనేనా ఒప్పుకోవాలి లేదా అవి మార్చడానికి బాధ్యతేనా వహించాలి. గొప్ప పుస్తకాలు మనకి హాయి కలిగించవు. మనని మనకి విప్పి చెప్పేసి అల్లరి పెడతాయి. మనని నిలదీసి ప్రశ్నిస్తాయి. నిలబెట్టి నడిపిస్తాయి. ఏదైనా చివరికి అశాంతే ఫలితం. అలాంటి విప్లవకరమైన అశాంతికి కారకులైన, ప్రమాదకరమైన రచయితలలో చాలా కొద్దిమందిలో ఒకరు రామారావుగారు.

-- వెల్చేరు నారాయణరావు

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి