పరోక్షము

 

ఆగష్టు 05, 2022

పరోక్షము (par-ōkshamu)

    అర్థము

   (విశేష్యము):ఇంద్రియాలకు తట్టనిది; ప్రత్యక్షంగా లేనిది; ఎదుట లేనిది; చాటుగా ఉన్నది

   Meaning

   (noun) : imperceptible to senses; invisible; out of sight; not present 

   వాడుక / Usage

 నల్లమల యురేనియం తవ్వకాలతో పరోక్షం గా 83కి.మీ పరిధిలోని గ్రామాలపై ప్రభావం ఉంటుంది.
 Uranium mining in Nallamala will affect villages up to a range of 83 km.

   మెదడుకు మేత / Food for thought

మనసెరిగినవాడు షేక్స్‌పియర్. మానసిక ఆరోగ్యం తెలుసు, అనారోగ్యమూ తెలుసు. మానసిక వ్యాధిగ్రస్తుల ప్రవర్తన ఫ్రాయిడ్‌కు నాలుగు వందల ఏళ్ళముందే షేక్స్‌పియర్ అర్థం చేసుకున్నాడని ఆయనను మెచ్చుకున్నారు. లేడీ మెక్‌బెత్ మాటిమాటికి చేతులు కడుక్కోవడం, నిద్రలో నడవడం, మెక్‌బెత్ గాలిలో కత్తిని చూడడం, బాంకో ప్రేతాత్మను డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీలో చూడడం యివన్నీ షేక్స్‌పియర్ అసాధారణ మానసిక శాస్త్రవిజ్ఞానానికి నిదర్శనాలు. ఈ విజ్ఞానానికి ఆయనను ఎంత మెచ్చుకోవలెనో అంతకంటే ఎక్కువగానే మెచ్చుకున్నారు. అయితే యిదంతా, షేక్స్‌పియర్ విజ్ఞానశాస్త్ర పరిజ్ఞాన విషయం. కాని షేక్స్‌పియర్ దార్శనికతలో దీనిని ఒక అంగంగా చూడగలిగితే, అంటే మనసే మనిషికున్న పెద్ద అనారోగ్యం, ఆ అనారోగ్యం యొక్క అనేక దశలే మనమనుకునే ఆరోగ్యవంతమైన మనసు అని దర్శించినవాడు షేక్స్‌పియర్; ఆ మనసును అన్ని దశలలో పట్టుకొని ప్రదర్శించినవాడు షేక్స్‌పియర్; అది అతని నిజమైన మానసిక వాస్తవికత అని తెలుస్తుంది.
-- సూరపరాజు రాధాకృష్ణమూర్తి

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి