ద్వీపకల్పము

 

ఆగష్టు 08, 2022

ద్వీపకల్పము (dvīpa-kalpamu)

    అర్థము

   (విశేష్యము): మూడు వైపుల నీరు, ఒక ప్రక్క భూమి ఉన్న ప్రదేశం; ద్వీపం=నీటితో చుట్టబడిన ప్రదేశం; కల్పము=లాంటిది, సమానమైనది (-ish )

   Meaning

   (noun) : peninsula 

   వాడుక / Usage

 ప్రపంచంలోని అన్నీ ద్వీపకల్పాల్లో అరేబియా అతి పెద్దది.
 Arabian peninsula is the biggest of its kind in the world.

   మెదడుకు మేత / Food for thought

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ
అందరికీ అందనిది పూచిన కొమ్మ
పుత్తడి బొమ్మ పూచిన కొమ్మ

పలకమన్న పలకదీ పంచదార చిలక
కులుకే సింగారమైన కోల సిగ్గుల మొలక
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
నిదురించే పెదవిలో పదముంది పాడుకో

ఆ రాణి పాదాల పారాణి జిలుగులు
నీ రాజ భోగాలు పాడనీ తెలుగులో
ఎదకన్నా లోతుగా పదిలంగా దాచుకో
గుడిలోని దేవతని గుండెలో కలుసుకో

ఈ జన్మకింతే ఇలా పాడుకుంటాను
ముందు జన్మ ఉంటే ఆ కాలి మువ్వనై పుడతాను

-- సిరిసిరి మువ్వ, వేటూరి (జనవరి 29, 1936 - 2010)

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి