వాలకం

 

ఫిబ్రవరి 24, 2025

వాలకం (valakam)

   అర్థము

  (విశేష్యము) : తిరునాళ్లలో వేసే వేషం; ఆకారం; విధానం; పద్ధతి;  మోసం

  Meaning

  (noun) : a disguise; mask; deceit; ways; behaviour

   వాడుక / Usage

     ఈ నాటికి పల్లెటూళ్ళలో వాడి వాలకం తగల బడ్డట్టుంది అంటుంటారు. అయితే ఈ వాలకం అనేది ఒక తెలుగు జానపద కళ.
     We hear people say his behaviour (valakam) is contemptible. But Valakam is one of the Telugu folk stage arts.

  మెదడుకు మేత / Food for thought

    అనంతపురం జిల్లా కదిరి పట్టణము పొలిమేరలలో క్రీస్తుశకం 1429 ప్రాంతమున కట్టబడి నేటికీ చెక్కు చెదరకుండా నిలిచి ఉన్న "చంద్రవదన - మోహియార్" గోరీ వెనుక హిందూ యువతికి మహమ్మదీయ యువకుడికి మధ్య జరిగిన విచిత్ర ఘట్టముంది..... ఆ ప్రేయసీ ప్రియుల రక్తం రాజుకు పరివారానికి వసంతం జల్లింది. సాయం సంధ్యా సమయం. కోప కషాయదీధితులతో ఎరుపెక్కిన వృద్ధ భానుడు ఆ రక్త ప్రవాహంలో మరింత యెర్రగా కనిపించాడు. రాజులు గతించారు. రాజ్యాలు అంతరించాయి. కానీ ఆ ప్రేయసీ ప్రియుల ప్రేమ చిహ్నమైన ఆ గోరీ యిప్పటికీ నిలిచి మానవ హృదయ కాఠిన్యాన్ని వెక్కిరిస్తూ వుంది.

    --- 31-10-1956 ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ సంచిక

Comments

Popular posts from this blog

పథము

మచ్చుతునక

తెరువరి